Navi Mumbai: నవీ ముంబైలోని డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం.. వీడియో
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నవీ ముంబైలోని (Navi Mumbai) తుర్భే వద్ద ఉన్న డంపింగ్ గ్రౌండ్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయని తుర్భే పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అనిల్ చవాన్ తెలిపారు.
- Author : Gopichand
Date : 04-02-2023 - 8:04 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నవీ ముంబైలోని (Navi Mumbai) తుర్భే వద్ద ఉన్న డంపింగ్ గ్రౌండ్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయని తుర్భే పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అనిల్ చవాన్ తెలిపారు. 7 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇంతవరకు అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
#WATCH | Massive fire at Turbhe dumping yard in Navi Mumbai; Fire fighting operation underway pic.twitter.com/EHXIbrPiUJ
— ANI (@ANI) February 3, 2023
Also Read: Gold And Silver Price Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు..!
ఒక్కసారిగా మంటలు తీవ్ర రూపం దాల్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు చెలరేగిన తర్వాత గాలిలో పొగ భారీగా వ్యాపించింది. దీంతో ఇక్కడ పరిసర ప్రాంతాలను అధికారులు పూర్తిగా ఖాళీ చేయించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పోలీసు బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. నివేదికల ప్రకారం.. తుర్భే డంపింగ్ గ్రౌండ్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ల్యాండ్‌ఫిల్‌లో పడేసిన తడి వ్యర్థాలు కుళ్ళిపోయినప్పుడు మీథేన్ వాయువు ఉత్పత్తి అవుతుంది. వేడి వాతావరణంలో మీథేన్ చాలాసార్లు మంటలను అంటుకుంటుంది. దాని కారణంగా ఇటువంటి సంఘటనలు జరుగుతాయని అంటున్నారు.