Chhattisgarh : నక్సలైట్ల బాంబ్ దాడిలో ఇద్దరు బార్డర్ పోలీసుల మృతి
Maoist IED Blast : నక్సలైట్ల బాంబ్ దాడిలో ఇద్దరు బార్డర్ పోలీసుల మృతి
- Author : Sudheer
Date : 19-10-2024 - 7:06 IST
Published By : Hashtagu Telugu Desk
ఛత్తీస్ గడ్ (Chhattisgarh ) రాష్ట్రంలో నక్సలైట్లు ఐఏడీ బాంబుల (Maoist IED Blast) పేల్చడంతో ఇద్దరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ జవాన్లు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్ట్‌లు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా..ఈరోజు వారు పెట్టిన ఐఈడీ బాంబులు పేలడంతో ఇద్దరు జవాన్లు అమరులు కాగా.. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌ల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టగా.. మందుపాతర పేలి జవాన్లు చనిపోయారు. చనిపోయిన ఇద్దరు జవాన్లలో ఒకరు కేజీ రాజేష్ (36) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కాగా.. మరో జవాన్ అమర్ పంజ్వార్ (36) స్వస్థలం మహారాష్ట్ర అని అధికారులు వెల్లడించారు. ఇద్దరు ITBP యొక్క 53వ బటాలియన్‌లో పనిచేస్తున్నారు. గాయపడిన జవాన్లను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన శనివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ (Narayanpur) జిల్లాలో చోటుచేసుకుంది.
Read Also : Rishabh Pant : పంత్ మళ్ళీ 90లో ఔట్..ఏడోసారి చేజారిన శతకం