Manmohan Singh : మన్మోహన్ విద్యాభ్యాసం.. పెషావర్ టు ఆక్సఫర్డ్
Manmohan Singh : పంజాబ్ వర్సిటీ నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, 1954లో మాస్టర్స్, 1957లో కేంబ్రిడ్జ్ నుంచి డిగ్రీ, 1962లో ఆక్సఫర్డ్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్లో లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా పొందారు
- By Sudheer Published Date - 06:09 AM, Fri - 27 December 24

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) జీవిత ప్రయాణం అతనికో స్ఫూర్తిదాయక కథ. అతని విద్యాభ్యాసం కేవలం జ్ఞానానికి పరిమితం కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శకమైన గొప్ప ఆలోచనలకు పునాదిగా నిలిచింది. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించిన మన్మోహన్, బాల్యంలోనే విద్యకు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. పెషావర్లో అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదివారు. దేశ విభజన తర్వాత 1948లో వారి కుటుంబం అమృత్సర్ కు వచ్చింది. పంజాబ్ వర్సిటీ నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, 1954లో మాస్టర్స్, 1957లో కేంబ్రిడ్జ్ నుంచి డిగ్రీ, 1962లో ఆక్సఫర్డ్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్లో లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా పొందారు.
పెషావర్‌లో మన్మోహన్ ప్రాథమిక విద్య :
పెషావర్‌లోని గవర్నమెంట్ హైస్కూల్‌లో మన్మోహన్ ప్రాథమిక విద్యను అభ్యసించారు. చిన్నతనంలోనే పాఠశాలలో అతని ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశవిభజన సమయంలో అతని కుటుంబం భారతదేశానికి వలస వచ్చాక, చదువుకు అడ్డంకులు ఎదురైనా అతని పట్టుదల తగ్గలేదు. ఈ పట్టుదల అతన్ని విజయవంతమైన విద్యార్థిగా మార్చింది. పంజాబ్ యూనివర్సిటీలో ఆయన ఉన్నత విద్యను కొనసాగించారు. ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడిగా, ఆ తర్వాత మాస్టర్స్ డిగ్రీ సాధించిన ఆయన, అద్భుతమైన శిక్షణతో భారతీయ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగారు.
Read Also : Manmohan Singh : మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలు..ఫలితాలు
కేంబ్రిడ్జ్ నుంచి ఆక్స్‌ఫర్డ్ వరకు
ఆర్థిక శాస్త్రంపై ఉన్న ఆసక్తితో మన్మోహన్ సింగ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి, అక్కడ ఆర్థిక శాస్త్రంలో ఆర్గనైజేషన్, అభివృద్ధిపై లోతైన అధ్యయనాలు చేశారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పూర్తి చేశారు. ఆక్స్‌ఫర్డ్‌లో ఆయన పరిశోధన ఆర్థిక విధానాల రూపకల్పనలో కీలకమైన శాస్త్రీయతను అందించింది. పెషావర్‌లో మొదలైన మన్మోహన్ విద్యా ప్రయాణం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ దాకా కొనసాగింది. అతని జీవితం కష్టపడితే ఏదైనా సాధ్యమని నిరూపించిన ఉదాహరణ. అతని విద్యాభ్యాసం, సాధించిన విజయాలు దేశానికి ఆర్థిక నిపుణుడిగా, నాయకుడిగా విశిష్టమైన గుర్తింపును తీసుకొచ్చాయి.
మన్మోహన్ హోదాలు.. లెక్చరర్ టు ప్రధాని
* 1957-65 పంజాబ్ వర్సిటీ లెక్చరర్, ప్రొఫెసర్
* 1966-69 UNOలో వర్క్
* 1969-71 ఢిల్లీ వర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్
* 1972 కేంద్ర ఆర్థికశాఖ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్
* 1976 ఆర్థికశాఖ కార్య దర్శి
* 1982-85 RBI గవర్నర్
* 1985-87 ప్రణాళికా సంఘం VC
* 1991లో యూజీసీ చైర్మన్
* 1991-96 ఆర్ధిక మంత్రి
* 2004 -14 దేశ ప్రధాని
మన్మోహన్ ఫ్యామిలీ విషయానికి వస్తే..
మన్మోహన్ 1958లో గుర్శరన్ కౌర్ను వివాహం చేసుకున్నారు. ఈమె ప్రొఫెసర్, రచయిత. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉపీందర్, దమన్, అమృత్ సింగ్ ఉన్నారు. ఉపీందర్ అకోలా వర్సిటీ డీన్, హిస్టరీ ప్రొఫెసర్, ఢిల్లీ వర్సిటీలో హిస్టరీ HODగా పనిచేశారు. ఈమె ఆరు పుస్తకాలు రాశారు. దమన్ అనేక నవలలు రాశారు. NATGRID సీఈవోగా పనిచేశారు. అమృత్ ACLUలో స్టాఫ్ అటార్నీగా సేవలందిస్తున్నారు. మన్మోహన్ అల్లుళ్లు ఉన్నతస్థానాల్లో ఉన్నారు.
Read Also : Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం.. ఈ రాష్ట్రంలో సెలవు!