Ratan Tata : మహారాష్ట్ర స్కిల్ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు..
Ratan Tata : ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీయల్ అవార్డులను రతన్ టాటా పేరుతో ఇవ్వాలని నిర్ణయించడంతో రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.
- By Latha Suma Published Date - 03:49 PM, Mon - 14 October 24

Maharashtr : మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రతన్ టాటా చిరస్మరణీయంగా నిలిచిపోవాలని..విద్య, నైపుణ్యాభివృద్ధికి రతన్ టాటా చేసిన కృషిని గుర్తించే లక్ష్యంతో మహారాష్ట్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం పేరును “రతన్ టాటా మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ”గా మార్చనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీయల్ అవార్డులను రతన్ టాటా పేరుతో ఇవ్వాలని నిర్ణయించడంతో రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.
Read Also: Chirag Paswan : కేంద్ర మంత్రికి ‘జడ్’ కేటగిరి భద్రత
ఇందుకు కోసం మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ టాటా అక్టోబర్ 9న రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. దేశం యావత్ ఆయనకు నివాళులు అర్పించింది. “టాటా గ్రూప్‌నే కాకుండా మన దేశం స్వరూపాన్ని కూడా తీర్చిదిద్దడానికి రతన్ టాటా కృషి చేశారు. ఆయన అసాధారణమైన నాయకుడు, మిస్టర్ రతన్ నావల్ టాటాకు మేము వీడ్కోలు పలుకుతున్నాము” అని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు.
టాటాను సత్కరించేందుకు, పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మధ్య తరగతి ప్రజల కలలను సాకారం చేయడానికి రతన్ టాటా 2015లో నానో కారును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఈ కారు ధర రూ.లక్ష మాత్రమే. రతన్ టాటా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ను స్థాపించి తన కంపెనీల ద్వారా వచ్చిన లాభాలలో 60 నుంచి 65 శాతం దాతృత్వ ప్రయోజనాల కోసం రతన్ టాటా విరాళంగా ఇచ్చి గొప్ప మానవత వాదిగా పేరు పొందారు. రతన్ టాటా కూడా ఓఆరఆర్ అప్రోచ్ రోడ్డుకు ఆయన పేరు పట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
ఇందుకు సంబంధించి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ట్వీట్ చేశారు. “2008లో గుజరాత్‌కు నానో కార్ల ప్రాజెక్ట్‌తో నష్టం వచ్చింది. దీంతో అప్పటి సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రతన్ టాటాకు లేఖ రాశారు. లేఖకు బదులుగా.. హైదరాబాద్ కోసం తన మనసులో ఏదో పెద్దది ఉందని, ఆ విధంగా ఆదిభట్లలో సికోర్స్కీ హెలికాప్టర్ ప్రాజెక్ట్ పుట్టిందని, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ యాంకర్ పరిశ్రమకు కృతజ్ఞతలు తెలుపుతూ నేడు గ్లోబల్ ఏరోస్పేస్ క్లస్టర్‌గా మారిందని ఆయన బదులిచ్చారు. ఆయన ORR వద్ద అభివృద్ధి కారణమయ్యాడు. ఓఆర్ఆర్ నుంచి ఆదిభట్ల వరకు ఉన్న అప్రోచ్ రోడ్డుకు రతన్ టాటా మార్గ్ అని పేరు పెట్టే అవకాశాన్ని పరిశీలించడం రతన్ టాటాకు ఘన నివాళిగా భావిస్తున్నాము ” అని శ్రీధర్ బాబు ట్వీట్ చేశారు.