Dasara : బస్సు చార్జీలు పెంచి సామాన్యుల జేబులు ఖాళీ చేసారు – హరీష్ రావు
tsrtc bus charges : స్పెషల్ బస్సు ల్లో టికెట్ ఛార్జీలు పెంచారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేసారని
- By Sudheer Published Date - 03:36 PM, Mon - 14 October 24

దసరా (Dasara) సందర్బంగా TGSRTC స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ స్పెషల్ బస్సుల్లో ( Special Buses) టికెట్ చార్జీల మోత మోగడం తో ప్రయాణికులు అగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్రంలో దసరా అనేది పెద్ద పండగ అని చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్న సరే దసరా వస్తుందంటే సొంత ఊర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా దసరా ను జరుపుకుంటుంటారు. కాగా ఈ దసరా డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని 6,304 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ స్పెషల్ బస్సు ల్లో టికెట్ ఛార్జీలు పెంచారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేసారని సోషల్ మీడియా వేదికగా టికెట్ ఫోటోలను షేర్ చేసారు.
ఈ చార్జీల పై హరీష్ రావు (Harish Rao) స్పందించారు. ఆర్టీసి టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం అని హరీష్ రావు ధ్వజమెత్తారు. టికెట్ ధర రూ. 140తో జేబీఎస్ నుండి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ. 200 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అలాగే హనుమకొండ నుండి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ. 300 ఉంటే, పండుగ వేళ రూ.420కి ఛార్జీలు పెంచిందని తెలిపారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమే ప్రజా పాలనన ముఖ్యమంత్రి గారు..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
Read Also : Koneti Adimulam : మొన్న వీడియో..నేడు ఆడియో..ఏంటి కోనేటి ఇది..?