Satyapal Malik : బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుంది : సత్యపాల్ మాలిక్
ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) మాట్లాడుతూ.. ‘‘బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
- By Pasha Published Date - 07:04 PM, Sun - 22 September 24

Satyapal Malik : సత్యపాల్ మాలిక్ గుర్తున్నారా ? అదేనండి గతంలో ఆయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా పనిచేశారు. అప్పట్లో ఆయన ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన మహారాష్ట్రలో రంగంలోకి దిగారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిని గెలిపిస్తానని సత్యపాల్ మాలిక్ అంటున్నారు.
Also Read :Public Reaction on HYDRA: సంగారెడ్డిలో హైడ్రా కూల్చివేతలపై నివాసితుల బాధలు వర్ణనాతీతం
ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) మాట్లాడుతూ.. ‘‘బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని తెలిపారు. హర్యానాతో పాటు మహారాష్ట్ర ఎన్నికలను నిర్వహించే ధైర్యం బీజేపీకి లేదన్నారు. అందుకే ఈ రెండు ఎన్నికలను వేర్వేరుగా నిర్వహిస్తోందని మాలిక విమర్శించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది అనేందుకు ఈ నిర్ణయాలే నిదర్శనమని మండిపడ్డారు. ‘‘మహారాష్ట్రపై నాకు చాలా ఆశలు ఉన్నాయి. ఈ రాష్ట్రం దేశానికి మార్గాన్ని చూపిస్తుంది’’ అని సత్యపాల్ మాలిక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read :Uday Bhanu Chib : యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్ భాను చిబ్
గతంలో పుల్వామా ఘటనపై బీజేపీ తీరును సత్యపాల్ మాలిక్ ఎండగట్టడం వివాదానికి దారితీసింది. అప్పట్లో ఇంటెలిజెన్స్ తప్పిదాల వల్లే పుల్వామా ఘటన జరిగి, ఎంతోమంది భారత సైనికులు అమరులయ్యారని ఆయన ఆరోపించారు. పుల్వామా ఘటన గురించి తాను ప్రధాని మోడీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌లకు సమాచారాన్ని అందిస్తే.. మౌనంగా ఉండాలని తనకు సూచించారని అప్పట్లో సత్యపాల్ కామెంట్ చేశారు. పుల్వామా ఘటనపై దర్యాప్తు చేయడాన్ని పక్కన పెట్టి, దాన్ని ఆనాడు ఎన్నికల అంశంగా బీజేపీ వాడుకుందని సత్యపాల్ మాలిక్ చెప్పడం అప్పట్లో రాజకీయ దుమారం క్రియేట్ చేసింది. మొత్తం మీద మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ తరఫున ప్రచారం చేస్తానని ఆయన చెప్పడాన్ని కీలక పరిణామం పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.