LPG Price Hike : వచ్చే వారం మళ్లీ గ్యాస్, పెట్రో డీజిల్ మోత
ఢిల్లీ - సిద్ధం అవండి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లు మళ్లీ పెరగబోతున్నాయి. గృహాధారిత, ఇండస్ట్రియల్ వంటగ్యాస్ ధరలు కూడా వరుపగా ఐదోసారి పెంచబోతున్నట్టు తెలుస్తోంది.
- By Hashtag U Published Date - 12:08 PM, Thu - 28 October 21

ఢిల్లీ – సిద్ధం అవండి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లు మళ్లీ పెరగబోతున్నాయి. గృహాధారిత, ఇండస్ట్రియల్ వంటగ్యాస్ ధరలు కూడా వరుపగా ఐదోసారి పెంచబోతున్నట్టు తెలుస్తోంది.
అక్టోబర్ 6వ తారీఖున పెరిగిన 15 రూపాయలతో కలిపి 14.2 కిలోల సిలిండర్ ధర జులై నెల నుంచి ఇప్పటివరకు ఏకంగా 90 రూపాయలు పెరిగింది. గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వకపోవడంతో అనుమతిస్తే గ్యాస్ ధరలను ఇంకోసారి పెంచాలని కంపెనీలు భావిస్తున్నట్టు సమాచారం. అంతర్జాతీయంగా పెరిగిన గ్యాస్ ధరలతో ఒక్కోసిలిండర్‌పై గ్యాస్ కంపెనీలకు దాదాపు వంద రూపాయల భారం పడుతోంది. సౌదీలో టన్నుకు 800 అమెరికన్ డాలర్లకు పెరిగితే.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర బ్యారల్‌కు 85.42 అమెరికన్ డాలర్లకు చేరువైంది.
గృహవసరమైన ఎల్పీజీ గ్యాస్ ధరలను సబ్సిడీలు ఇచ్చి తగ్గించేందుకు ప్రభుత్వాలకు అనుమతి ఉన్నా కూడా ఆ పనిచేయడంలేదు. గత ఏడాది నుంచి వరుసగా పెట్రోల్, ఎల్పీజీ గ్యాస్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయని కంపెనీలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ధరలను పెంచుతున్నట్టు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఢిల్లీ, ముంబై రాష్ట్రాల్లో గ్యాస్ సలిండర్ ధర రూ.899.50 ఉంటే ముంబైలో రూ.926 ఉంది. మరోవైపు రెండ్రోజుల గ్యాప్‌తో పెట్రోల్, డీజిల్ ధరలకు కూడా 35పైసలు పెంచాయి కంపెనీలు.ఇప్పుడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.94 ఉంటే.. ముంబైలో రూ.113.80గా ఉంది. దాదాపు అన్ని నగరాల్లో పెట్రలక్ష ధర సెంచరీ దాటితే.. జమ్మూకాశ్మీర్, తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాల్లో డీజిల్ ధర కూడా వంద దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28 తర్వాత 22 సార్లు పెట్రోల్ ధరలను పెంచాయి కంపెనీలు.
Related News

LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. సిలిండర్‌పై వంద రూపాయలు పెంపు..!
నేటి నుండి నవంబర్ నెల ప్రారంభం కాగా ఎల్పిజి సిలిండర్లపై ద్రవ్యోల్బణం బాంబు (LPG Cylinder Price) పేలింది.