HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Learning English Is Not A Shame It Is A Symbol Of Student Empowerment Rahul Gandhi

Rahul Gandhi : ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు..విద్యార్థుల సాధికారతకు చిహ్నం: రాహుల్‌ గాంధీ

ఇంగ్లిషు భాష నేర్చుకోవడం సిగ్గు కాదని స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిషు భాష అనేది విద్యార్థుల సాధికారతకు చిహ్నం. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆ భాష చాలా అవసరం. మాతృభాషతోపాటు ఆంగ్ల భాషను కూడా నేర్పించడం అనివార్యం అని రాహుల్ అన్నారు.

  • By Latha Suma Published Date - 06:10 PM, Fri - 20 June 25
  • daily-hunt
Learning English is not a shame, it is a symbol of student empowerment: Rahul Gandhi
Learning English is not a shame, it is a symbol of student empowerment: Rahul Gandhi

Rahul Gandhi: ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విదేశీ భాషలపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లిషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు త్వరలో వస్తాయి అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భవిష్యత్‌లో మన దేశంలో ఇంగ్లిషు మాట్లాడటం ఒక సిగ్గుగా పరిగణించబడే రోజులు వస్తాయని అమిత్‌ షా స్పష్టం చేశారు. భారతదేశ సంస్కృతిని, ధర్మాన్ని, అంతర్గత ఆత్మను అర్థం చేసుకోవడానికి విదేశీ భాషలు సరిపోవని అభిప్రాయపడ్డారు. భారతీయతను పూర్తిగా అనుభవించేందుకు, దేశ సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు మాతృభాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని అమిత్‌ షా పునరుద్ఘాటించారు. విదేశీ భాషల్లో అభివ్యక్తి సాధ్యమైనా, వాటితో సంపూర్ణ భారతీయతను వ్యక్తపరచడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also: KTR : కేటీఆర్, జగదీశ్ రెడ్డి పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా

అయితే ఇది సాధించడం సులభం కాదన్నది తనకు తెలుసని తెలిపారు. అయినా మన సమాజం ఈ మార్గంలో ముందుకు సాగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, అమిత్‌ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇంగ్లిషు భాష నేర్చుకోవడం సిగ్గు కాదని స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిషు భాష అనేది విద్యార్థుల సాధికారతకు చిహ్నం. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆ భాష చాలా అవసరం. మాతృభాషతోపాటు ఆంగ్ల భాషను కూడా నేర్పించడం అనివార్యం అని రాహుల్ అన్నారు. ఆంగ్ల భాష విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని, ఉపాధిని కల్పించగల శక్తి ఉన్న భాషగా రాహుల్ అభివర్ణించారు. భారతదేశంలోని ప్రతి భాషలో ఆత్మ, సంస్కృతి, జ్ఞానం నిక్షిప్తంగా ఉన్నాయని, వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే ఆంగ్ల భాషను నిర్లక్ష్యం చేయలేమని స్పష్టం చేశారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు పేద విద్యార్థులు ఇంగ్లిషు భాష నేర్చుకుని సమానత్వాన్ని సాధించడం ఇష్టం ఉండదు. అందుకే వారికి విద్యను దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యలో భాషలకు సంబంధించి సమతుల్యత అవసరమని, మాతృభాషను ఆదరించడమే కాకుండా, భవిష్యత్‌ను నిర్మించేందుకు ఆంగ్ల భాష కూడా తప్పనిసరిగా ఉందని ఆయన హితవు పలికారు. ఈ భాషా చర్చపై దేశవ్యాప్తంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సంస్కృతి పరిరక్షణకు మాతృభాషల పట్ల మక్కువ, మరోవైపు ప్రపంచ మంత్రములో పోటీకి ఆంగ్ల భాష ప్రాముఖ్యం ఈ రెండు అంశాల మధ్య సమతౌల్యాన్ని ఎలా ఏర్పరిచేది అనేది కీలకంగా మారింది.

Read Also: Secunderabad : మిలిటరీ ఏరియాలో చొరబాటుపై దర్యాప్తు ముమ్మరం

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • English Language
  • rahul gandhi
  • rss
  • Union Home Minister Amit Shah

Related News

Cwc Meet

CWC meet: పాట్నాలో ప్రారంభమైన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం – బీహార్ ఎన్నికలపై వ్యూహరచన

స్వాతంత్ర్యం తర్వాత బీహార్‌లో తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇదే కావడం ప్రత్యేకత. కాంగ్రెస్ పార్టీ ఈ భేటీలో రెండు కీలక తీర్మానాలను ఆమోదించే అవకాశముందని సమాచారం.

  • Bjp Ramachandra

    CM Revanth : రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది – రామచందర్ కీలక వ్యాఖ్యలు

Latest News

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

Trending News

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd