HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Landslides Triggered By Heavy Rains In Wayanad

Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

  • Author : Vamsi Chowdary Korata Date : 07-07-2026 - 3:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Landslides triggered by heavy rains in Wayanad...
Landslides triggered by heavy rains in Wayanad...

కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాల ధాటికి ఘోర ప్రమాదం సంభవించింది. కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో సొరంగం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది వరకు మట్టిపెళ్లల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనక్కంపొయిల్-కల్లాడి-మెప్పాడి జంట సొరంగం రహదారి పనులు సాగుతున్న క్రమంలో, ఒక్కసారిగా కొండ పైనుంచి భారీగా మట్టి, రాళ్లు విరిగిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), అగ్నిమాపక మరియు పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేరళ మంత్రి టి. సిద్దిఖీ స్పందిస్తూ, ఇది ముమ్మాటికి మానవ తప్పిదమేనని విమర్శించారు. వదులుగా ఉన్న మట్టిని తొలగించాలని జూన్ 20వ తేదీనే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఈ ఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించి, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మంత్రులను ఘటనా స్థలానికి పంపారు.

గత 24 గంటల్లో వయనాడ్ జిల్లాలో 265 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ జిల్లాకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో 2024లో సంభవించిన పెను విపత్తులో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కురుస్తున్న వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నప్పటికీ, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • heavy rains
  • Kerala Rains
  • kerala wayanad landslide
  • Wayanad floods
  • Wayanad landslide

Related News

Rains inundating Mumbai

Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

మహారాష్ట్రలోని పుణే జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. పశ్చిమ ఘాట్లలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోనావాలో కేవలం 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 670 మిల్లీమీటర్ల (67 సెంటీమీటర్లు) అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్లౌడ్ బరస్ట్ (మేఘమథనం) తరహాలో కురిసిన ఈ వానతో పాటు, చుట్టుపక్కల ఉన్న భిరా, తంహిని, షిర్గాన్, అంబోన్, ఖోపోలి వంటి ఘాట్ ప్రాంతాలలో క

  • Heavy rains in these areas today.

    Heavy Rains: ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Heavy rains in these areas today.

    Heavy Rains: ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు

  • Depression in the Bay of Bengal... Very heavy rains for several districts.

    Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం

Latest News

  • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

  • ‘అమ్మ’ రాజీనామా కలకలం.. అసలేం జరుగుతోంది

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd