Karnataka: దుకాణాల నేమ్‌ప్లేట్లలో 60% కన్నడ అక్షరాలు ఉండాలి
కన్నడ సైన్ బోర్డులను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు మరియు వ్యాపార సంస్థలకు కన్నడ భాషలో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.
- Author : Praveen Aluthuru
Date : 27-12-2023 - 5:02 IST
Published By : Hashtagu Telugu Desk
Karnataka: కన్నడ సైన్ బోర్డులను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు మరియు వ్యాపార సంస్థలకు కన్నడ భాషలో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దుకాణాల నేమ్‌ప్లేట్లు మరియు సైన్‌బోర్డ్‌లపై 60% కన్నడ అక్షరాలను ఉపయోగించాలని పేర్కొంది. దశాబ్దాలుగా కన్నడ సాహిత్యవేత్తలు డిమాండ్ చేస్తుండటంతో ఈ అంశం పలుమార్లు తెరపైకి వచ్చింది.
కన్నడ భాషను సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులోని వాణిజ్య దుకాణాల నేమ్‌ప్లేట్లు మరియు సైన్‌బోర్డ్‌లపై 60% కన్నడ అక్షరాలను ఉపయోగించడం తప్పనిసరి చేశారు. ఇది కన్నడ గుర్తింపును కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నదని, ప్రజలందరూ దీనిని అనుసరించాలని కోరారు. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు ఫిబ్రవరి 28 వరకు గడువు విధించారు.
రాష్ట్రంలో కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం నొక్కి చెప్పారు. నివాసితులు తమను తాము ‘కన్నడిగలు’గా పరిగణించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కన్నడకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్ఘాటించారు. నిర్దేశిత గడువులోగా నేమ్‌ప్లేట్లన్నీ కన్నడలో ఉండాలని బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ ప్రకటించారు. మాల్స్, దుకాణాలు మరియు వాణిజ్య సంస్థలు తమ నేమ్‌ప్లేట్‌లను తదనుగుణంగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
#WATCH | Bengaluru: Kannada Raksha Vedhike holds a protest demanding all businesses and enterprises in Karnataka to put nameplates in Kannada. pic.twitter.com/ZMX5s9iJd0
— ANI (@ANI) December 27, 2023
Also Read: CM Revanth: నిరుద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్, ఉద్యోగాల భర్తీకి హామీ!