Kamal Haasa : కన్నడ భాషపై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నాకు కుటుంబం ఉంది, అందుకే ఇక్కడకు వచ్చాను. మీ భాష (కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా మరియు రాజకీయ వర్గాల్లో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- By Latha Suma Published Date - 11:02 AM, Wed - 28 May 25

Kamal Haasa : కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రముఖ నటుడు, రాజకీయవేత్త అయిన కమల్ ఇటీవల చెన్నైలో జరిగిన ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌లో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నాకు కుటుంబం ఉంది, అందుకే ఇక్కడకు వచ్చాను. మీ భాష (కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా మరియు రాజకీయ వర్గాల్లో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: Karnataka : దేశంలోనే తొలి హెలికాప్టర్ తయారీ కేంద్రం.. ఎక్కడంటే..!
తాజాగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..‘‘మాతృభాషను గౌరవించడం తప్పుకాదు. కానీ, ఇతర భాషలను తక్కువ చేయడం, అవమానించడం ఎంతో అనుచితం. కమల్ హాసన్ వంటి ప్రముఖులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. కన్నడ భాష అనేక శతాబ్దాల చరిత్ర కలిగినది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి గౌరవించదగిన భాష. అలాంటి భాషపై తక్కువ భావనతో మాట్లాడటం అంగీకారయోగ్యం కాదు’’ అన్నారు.‘‘దక్షిణాదిలో సోదరత్వాన్ని పెంపొందించాల్సిన సమయంలో కమల్ హాసన్ వంటి వ్యక్తులు విడదీయడం ప్రయత్నిస్తున్నారు. గతంలోనూ ఆయన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం భాషపై కాకుండా కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. కమల్ హాసన్ వెంటనే తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
ఇక కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ అండ్ యాక్షన్ డ్రామా జానర్‌లో తెరకెక్కుతోంది. త్రిష, శింబు వంటి ప్రముఖులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కమల్ ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ‘థగ్ లైఫ్’ జూన్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. కమల్ వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశముంది. కన్నడ సినీ పరిశ్రమలో కూడా ఈ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. భాషల మధ్య సౌభ్రాత్రం అవసరమన్న సందేశాన్ని అందరూ పునరుద్ఘాటిస్తున్న సమయంలో కమల్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. భాషల పరస్పర గౌరవం, సాంస్కృతిక ఐక్యతకు భంగం కలిగించేలా ఈ వివాదం మలుపు తిరిగింది.