కేసీఆర్ `లెగ్` మహిమ, ఆ రెండు రాష్ట్రాల్లో `జేడీయూ ముక్త్`
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభావం బీహార్ సీఎం నితీష్ కమార్ కు బాగా తగిలింది. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లో `జూడీయూ ముక్త్` ఆపరేషన్ కొనసాగుతోంది.
- By CS Rao Published Date - 11:33 AM, Sat - 3 September 22

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభావం బీహార్ సీఎం నితీష్ కమార్ కు బాగా తగిలింది. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లో `జూడీయూ ముక్త్` ఆపరేషన్ కొనసాగుతోంది. ఐదుగురు ఎమ్మెల్యేలు జేడీయూను మణిపూర్ అసెంబ్లీ కేంద్రంగా విలీనం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని జేడీయూ ఎమ్మెల్యేలు కూడా అదే పంథాలో నడుస్తుండడం గమనార్హం.
మణిపూర్‌లో జేడీయూకు ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో చేరారు. ఆ వెంటనే నితీశ్‌ను ఉద్దేశించి బీజేపీ నేత, ఎంపీ సుశీల్ మోదీ ట్వీట్ చేస్తూ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ‘జేడీయూ ముక్త్’గా మారుతున్నాయని సెటైర్ వేయడం రాజకీయా దుమారాన్ని రేపుతోంది.
జేడీయూ ఎమ్మెల్యేల విలీనాన్ని మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. బీహార్ లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత నితీశ్ కుమార్‌కు ఎదురుదెబ్బలు తగలడం గత 9 రోజుల్లో ఇది రెండోసారి. ఆగస్టు 25న అరుణాచల్ ప్రదేశ్ జేడీయూ ఎమ్మెల్యే టెకి కసో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2019లో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జేడీయూ ఏడు సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత అందులో ఆరుగురు శాసనసభ్యులు బీజేపీలో చేరారు. ఆగస్టు 25న ఆ మిగిలిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరడంతో అక్కడ జేడీయూ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
Related News

BJP Election Plan : కేసీఆర్, జగన్ అప్పులు, బీజేపీ ఎన్నికల అస్త్రం అదే..!
తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ (PM MOdi) పరోక్ష చురకలు వేశారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రం అప్పులు ఇవ్వడం లేదని తనను తిడుతోందని గుర్తు చేశారు. అలాగే మరో రాష్ట్రం అప్పుల మీద అప్పులు చేస్తూ ఏమవుతుందో చూస్తున్నామని ఆయా రాష్ట్రాల గురించి మోడీ అనటం జగన్ , కేసీఆర్ లను టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఏ రాష్ట్రం పేరును ఈ సందర్భంగా ఎత్తనప్పటి�