Jaya Bachchan: ఐదోసారి రాజ్యసభకు జయా బచ్చన్ నామినేషన్.. ఆస్తుల ప్రకటన
- Author : Latha Suma
Date : 14-02-2024 - 12:10 IST
Published By : Hashtagu Telugu Desk
Jaya Bachchan: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భార్య జయా బచ్చన్ (Jaya Bachchan) వరుసగా ఐదోసారి రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ (Samajwadi Party) తరఫున ఆమె ఐదోసారి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
2004 నుండి సమాజ్ వాదీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన జయా బచ్చన్ ఎన్నికల అఫిడవిట్ (election affidavit)లో రూ.1,578 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ వ్యక్తిగత నికర విలువ రూ.1,63,56,190 కాగా, అదే కాలానికి తన భర్త అమితాబ్ బచ్చన్ సంపద రూ.273,74,96,590గా ఎన్నికల అఫిడవిట్‌లో జయా బచ్చన్ పొందుపరిచారు. ఇక ఉమ్మడి చరాస్తుల విలువ రూ. 849.11 కోట్లుగా, స్థిరాస్తి మొత్తం రూ.729.77 కోట్లుగా పేర్కొన్నారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ రూ.పది కోట్లు (10,11,33,172)గా చూపించారు. తన భర్త అమితాబ్ బచ్చన్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.120,45,62,083గా వెల్లడించారు.
ఇక ఈ జంట వద్ద మొత్తం రూ.90 కోట్లకు పైగా విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. తన వద్ద రూ. 40.97 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నట్లు జయా బచ్చన్ ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. తన భర్త వద్ద రూ. 54.77 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. తన పేరుపై రూ. 9.82 లక్షల విలువైన వాహనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అమితాబ్ వద్ద రెండు మెర్సిడెస్, రేంజ్ రోవర్ సహా 16 వాహనాలు ఉన్నట్లు తెలిపారు. వాటి విలువ మొత్తం రూ. 17.66 కోట్లుగా వెల్లడించారు.
read also : Musk Vs Putin : అలా జరిగితే పుతిన్‌ను చంపేస్తారు.. మస్క్ సంచలన కామెంట్