Jaipur : 200 అడుగుల లోతు బోరుబావిలో పడిన బాలుడు.. సురక్షితంగా బటయటికి తీసిన రెస్క్యూ టీమ్
జైపూర్‌లో శనివారం ఉదయం ఆడుకుంటూ 200 అడుగుల లోతైన బోరుబావిలో ఓ బాలుడు పడిపోయాడు. అయితే వెంటనే
- Author : Prasad
Date : 21-05-2023 - 11:05 IST
Published By : Hashtagu Telugu Desk
జైపూర్‌లో శనివారం ఉదయం ఆడుకుంటూ 200 అడుగుల లోతైన బోరుబావిలో ఓ బాలుడు పడిపోయాడు. అయితే వెంటనే స్పందిచిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బాలుడిని 4వ తరగతి చదువుతున్న 9ఏళ్ల లక్కీగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కీ పాఠశాలకు సెలవుల సమయంలో భోజ్‌పురా గ్రామంలోని తన మేనమామ ఇంటికి వచ్చాడు. శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఆడుకుంటూ లక్కీ బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉన్న బోరుబావిలో చిక్కుకున్నాడు సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. చిన్నారిని బోరుబావి నుంచి బయటకు తీసేందుకు చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది. అతనికి తాళ్ల ద్వారా బోర్‌వెల్‌లోకి ఆక్సిజన్, తాగునీరు సరఫరా చేశారు. ఆ తరువాత సమాంతరంగా గొయ్యి తవ్వి, గంటల తరబడి శ్రమించి బాలుడిని సురక్షితంగా బోరుబావి నుంచి బయటకు తీశారు.