Waqf Bill : వక్ఫ్ బిల్లుపై జగన్ మౌనం.. కారణం అదే – టీడీపీ
Waqf Bill : హైదరాబాద్‌లోని "సాక్షి" మీడియా ప్రధాన కార్యాలయాన్ని వక్ఫ్ భూములపై అక్రమంగా కట్టించారని ఆరోపించింది. ఈ కారణంగానే ఆయన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఆరోపణ
- Author : Sudheer
Date : 04-04-2025 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
వక్ఫ్ (Waqf Bill) బిల్లు -2025 దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు, రాజ్యసభ(Rajyasabha)లో ఆమోదం(Passed) పొందింది. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో అవినీతిని అరికట్టేందుకు ఈ బిల్లును తీసుకొచ్చిందని చెబుతోంది. అయితే రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కులకు విరుద్ధంగా ఉందని విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఈ బిల్లు ఉత్కంఠ రేపుతోంది. ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం, జనసేన పార్టీలు వక్ఫ్ బిల్లుకు మద్దతు ప్రకటించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది.
Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లు వలన ముస్లిం మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
టీడీపీ వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. టీడీపీ అధికారిక సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణల ప్రకారం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) హైదరాబాద్‌లోని “సాక్షి” మీడియా ప్రధాన కార్యాలయాన్ని వక్ఫ్ భూములపై అక్రమంగా కట్టించారని ఆరోపించింది. ఈ కారణంగానే ఆయన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఆరోపణ చేసింది. వక్ఫ్ సంస్కరణలు అమలులోకి వస్తే వైఎస్ జగన్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే ఆయన ఈ బిల్లుపై మౌనంగా ఉన్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KKR vs SRH: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఘోర అవమానం.. 80 పరుగుల తేడాతో కోల్‌కతా ఘనవిజయం
వక్ఫ్ (సవరణ) బిల్లుపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ముస్లిం సంఘాల అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ బిల్లు మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందన్నారు. ఏపీ రాష్ట్రంలో 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారని, వారి హక్కులను కాపాడటంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వక్ఫ్ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం అనవసరమని, ఇది ముస్లింల హక్కులను హరించడమేనని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. వక్ఫ్ బిల్లును టీడీపీ మద్దతు ఇవ్వడం ద్వారా, ఆ పార్టీ సిద్ధాంతాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కానీ ఇప్పుడు రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించడం తో జగన్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.
వక్ఫ్ బిల్లుకు నో అని జగన్ ఎందుకు చెబుతున్నాడో తెలుసా? హైదరాబాదులో ఉన్న సాక్షి ప్రధాన కార్యాలయం వక్ఫ్ భూములను ఆక్రమించి కట్టాడు. వక్ఫ్ సంస్కరణలు అమలులోకి వస్తే కబ్జా సాక్షి పునాదులు కదులుతాయి. #SakshiOnWaqfLand pic.twitter.com/XkejhXtaGx
— Telugu Desam Party (@JaiTDP) April 3, 2025
జగన్ లాంటోడు మేలు చేయకపోతే చేయక పోయాడు… కీడు చేయక పొతే చాలు అనుకుంటారు జనం. కానీ ముస్లింలకు అలా అనుకునే అవకాశం ఇవ్వలేదు జగన్. వక్ఫ్ భూమిని కబ్జా చేసి అందులో సాక్షి ప్రధాన కార్యాలయం కట్టాడు జగన్. #SakshiOnWaqfLand pic.twitter.com/5I9enFCE36
— Telugu Desam Party (@JaiTDP) April 3, 2025
జగన్ క్విడ్ ప్రో కో పునాదిగా సాక్షి మీడియా నిర్మించబడిందని ప్రజలందరికీ తెలుసు. కానీ హైదరాబాద్ లోని సాక్షి ప్రధాన కార్యాలయం నిర్మించబడింది ఆక్రమిత వక్ఫ్ భూమిలో అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు?#SakshiOnWaqfLand pic.twitter.com/WcRF4dTFJi
— Telugu Desam Party (@JaiTDP) April 3, 2025