HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Isro Successful At Gaganyaan Failure Test Crew Escape System Works

Gaganyaan Success : ఇస్రో మరో ఘనత.. ‘గగన్‌యాన్’ తొలి ప్రయోగం సక్సెస్

Gaganyaan Success : గగన్‌యాన్ మిషన్ తొలి ప్రయోగం సక్సెస్ అయింది.

  • By Pasha Published Date - 10:44 AM, Sat - 21 October 23
  • daily-hunt
Gaganyaan Mission
Gaganyaan Success

Gaganyaan Success : గగన్‌యాన్ మిషన్ తొలి ప్రయోగం సక్సెస్ అయింది. ఈ ప్రయోగ పరీక్ష శ్రీహరి కోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదికగా శనివారం ఉదయం 8 గంటలకు జరగాల్సి ఉండగా రెండుసార్లు వాయిదాపడింది.  తొలుత దాన్ని వాతావరణ సమస్యల కారణంగా 8.45 గంటలకు వాయిదా వేశారు. అనంతరం రాకెట్ లో సాంకేతిక లోపం బయటపడటంతో మరోసారి వాయిదా వేశారు. దీనివల్ల దాదాపు  2 గంటల పాటు ప్రయోగ పరీక్షలో జాప్యం జరిగింది. అనంతరం లోపాలను సవరించుకొని.. ఉదయం 10 గంటలకు నిర్వహించిన ప్రయోగ పరీక్షలో సానుకూల ఫలితాలు వచ్చాయి. గగన్‌యాన్ మిషన్ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది. ఉదయం 10 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అది  17 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత.. అందులోని క్రూ మాడ్యూల్‌ వ్యవస్ధ వేరుపడింది. క్రూ మాడ్యూల్‌, క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ రాకెట్‌ నుంచి విడిపోయాయి. తర్వాత క్రూ మాడ్యూల్ కు ఉన్న పారాచూట్‌ విచ్చుకోవడంతో.. అది సెకనుకు 8.5 మీటర్ల వేగంతో భూమి వైపునకు దూసుకొచ్చి బంగాళాఖాతంలో (Gaganyaan Success) పడిపోయింది. అప్పటికే బంగాళాఖాతంలో సిద్ధంగా ఉన్న నేవీ సిబ్బంది వెంటనే వెళ్లి.. క్రూ మాడ్యూల్ ను సురక్షితంగా రికవరీ చేశారు. దీంతో ప్రయోగం సక్సెస్ ఫుల్ గా పూర్తయింది.

#WATCH | Sriharikota: ISRO launches test flight for Gaganyaan mission after first test flight was aborted pic.twitter.com/pIbmjyJj3W

— ANI (@ANI) October 21, 2023

ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ ఏమన్నారంటే..

ఈ ప్రయోగం సక్సెస్ కావడంపై ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ ప్రయోగం విజయవంతమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. క్రూ ఎస్కేప్ మోడల్ ను నమూనాగా ప్రయోగించాలని నిర్ణయించాం. అనుకున్న విధంగానే ప్రయోగం జరిగింది. బంగాళాఖాతంలోకి దిగిన క్రూ మాడ్యూల్ ను రికవరీ చేశాం. దానిని అధ్యయనం చేస్తాం. మొదట్లో వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో ప్రయోగ సమయాన్ని వాయిదా వేశాం. రాకెట్ ప్రయోగం మొదలయ్యే ముందు సాంకేతిక సమస్యను గుర్తించాం. దానిని సత్వరమే గుర్తించి సరి చేశాం. రాకెట్ స్థితి ని పరిశీలించి మళ్లీ ప్రయోగించాం. ఏదైనా సమస్య ఎదురైతే ఎలా సరిదిద్దాలనే విషయాన్ని మా బృందం చేసి చూపించింది’’ అని ఆయన వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రయోగం ఇలా జరిగింది.. 

  • టీవీ–డీ1 రాకెట్ 17 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లాక.. దాని ఎగువ కొన భాగంలో అమర్చిన ‘క్రూమాడ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టం’ వేరు పడింది.
  • ఈ ప్రయోగంలో రాకెట్ సెకనుకు 400 మీటర్ల వేగంతో దూసుకెళ్లింది. అది నింగిలోకి బయల్దేరాక, అకస్మాత్తుగా వెనక్కి వచ్చే సిగ్నల్స్ ను దానికి పంపారు. దీన్నే ‘అబార్ట్‌’ మెసేజ్ అంటారు.
  • అబార్ట్ మెసేజ్ అందిన వెంటనే రాకెట్‌ శిఖరభాగంలో అమర్చిన ‘క్రూమాడ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టం’  విడిపోయింది. భూమికి 17 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ ఉండగా ఈ ప్రక్రియ  జరిగింది.
  • విడిగా జర్నీ ప్రారంభించిన ‘క్రూమాడ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టం’ .. దానిలోని 10 ప్యారాచూట్ల సాయంతో శ్రీహరికోట రాకెట్‌ కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న  బంగాళాఖాతంలో ల్యాండ్ అయింది.
  • బంగాళాఖాతంలో అప్పటికే సిద్ధంగా ఉండే కోస్టల్‌ నేవీ సిబ్బంది ఒక ప్రత్యేక బోట్‌లో వెళ్లి క్రూమాడ్యూల్‌ ను సురక్షితంగా రికవర్ చేశారు.

Also Read: Man Crueal Attack on Dog కుక్క మొరిగిందని పక్కింటి వ్యక్తి క్రూరత్వం.. ప్రైవేట్ పార్ట్ లో రాడ్డుతో..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Crew Escape System
  • Gaganyaan Mission
  • Gaganyaan project 2024
  • Gaganyaan Success
  • isro

Related News

    Latest News

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd