Man Crueal Attack on Dog కుక్క మొరిగిందని పక్కింటి వ్యక్తి క్రూరత్వం.. ప్రైవేట్ పార్ట్ లో రాడ్డుతో..!
Man Cruel Attack on Dog పక్కింటి కుక్క మొరిగిందని ఓ వ్యక్తి క్రూరంగా దాన్ని హింసించాడు. ఒడిశాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియా
- Author : Ramesh
Date : 21-10-2023 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
Man Cruel Attack on Dog పక్కింటి కుక్క మొరిగిందని ఓ వ్యక్తి క్రూరంగా దాన్ని హింసించాడు. ఒడిశాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియా (Social Media)లో వైరల్ గా మారింది. పక్కింటి కుక్క అదే పనిగా మొరుగుతుండటం వల్ల చందన్ నాయక్ అనే వ్యక్తి ఆ శునకం ప్రైవేట్ పర్ట్ లో ఐరన్ రాడ్ ని చొప్పించాడు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన వల్ల అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది.
కుక్క (Dog) అరుస్తుందని పక్కింటికి వెళ్లి అరవడం మొదలు పెట్టిన వారికి యజమాని సమాధానం ఇవ్వడానికి వెళ్తే ఆమె మీద కూడా తండ్రీ కొడుకులు అసభ్యకరంగా ప్రవర్తించారని తెలుస్తుంది. ఆ మహిళ జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెల్లారరట. బట్టలన్నీ చింపే ప్రయత్నం చేసి ఆమెపై అత్యాచారానికి కూడా ప్రయత్నించారని సమాచారం.
Also Read : Gruha Lakshmi Scheme : ఆ ప్రాంతాల్లో ‘గృహలక్ష్మి’ అమలుపై హైకోర్టు స్టే
యజమాని కోసం శునకం ఆ తండ్రి కొడుకుల మీద పెద్దగా అరవడం వల్ల చందన్ నాయక్ (Chandan Nayak) అత్యంత క్రూరంగా ఆ కుక్క ప్రైవేట్ పార్ట్ లో ఐరన్ రాడ్ చొప్పించారని ఆ మహిళ ఫిర్యాధు చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు. శునకం మీద ఈ పైశాచికత్వాన్ని చూపించిన ఆ తండ్రి కొడుకుల మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.
కుక్క మీదే అలాంటి దుశ్చర్య చేసిన వారు బయట ఆడవాళ్లను ఎలా చూస్తారో అంటూ వారి మీద ఫైర్ అవుతున్నారు. పోలీసులు మాత్రం కేసు విచారిస్తూ అసలు గొడవ ఎక్కడ మొదలైంది ఎందుకు వారు ఆ శునకం మీద దాడి చేయాల్సి వచ్చింది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.