ISRO Chief Somanath: ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్.. ఎప్పుడు తెలిసిందంటే..?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO Chief Somanath) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
- Author : Gopichand
Date : 04-03-2024 - 5:38 IST
Published By : Hashtagu Telugu Desk
ISRO Chief Somanath: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO Chief Somanath) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. భారతదేశం ప్రతిష్టాత్మక సోలార్ మిషన్ ఆదిత్య L-1 ప్రారంభించిన రోజున అతనికి ఈ విషయం తెలిసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అతను స్వయంగా ఈ తీవ్రమైన వ్యాధిని వెల్లడించాడు. ఆదిత్య-ఎల్1 మిషన్‌ను ప్రారంభించిన సమయంలోనే తనకు క్యాన్సర్ గురించి తెలిసిందని సోమనాథ్ తెలియజేశారు.
చంద్రయాన్-3 ప్రయోగించినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది
చారిత్రాత్మక చంద్రయాన్-3 మిషన్ సమయంలోనే ఆయనకు ఆరోగ్య సంబంధిత సమస్యలు మొదలయ్యాయని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని చెప్పారు. వ్యాధి నిర్ధారణ తర్వాత ఇస్రో చీఫ్ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయి. అయితే, అప్పటి వరకు దీనికి సంబంధించి పరిస్థితి స్పష్టంగా లేదు. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ప్రారంభించిన రోజునే వ్యాధి గురించి తనకు తెలిసిందన్నారు. నివేదిక ప్రకారం.. ఈ వార్త తనకే కాకుండా కుటుంబానికి కూడా షాక్ ఇచ్చిందని సోమనాథ్ చెప్పారు.
Also Read: Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సీనియర్ నేత
‘క్యాన్సర్‌ను నయం చేసే అవకాశం ఉంది’
ఆదిత్య ఎల్-1 మిషన్ గతేడాది సెప్టెంబర్ 2న ప్రారంభించబడింది. ఆ సమయంలో ఎస్ సోమనాథ్‌ను వైద్యులు పరీక్షించగా స్కానింగ్‌లో కడుపులో కొంత పెరుగుదల కనిపించింది. సమాచారం అందిన వెంటనే తదుపరి విచారణ నిమిత్తం తమిళనాడు రాజధాని చెన్నైకి బయల్దేరి వెళ్లినట్లు సమాచారం. ఇక్కడ అతనికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇప్పుడు క్యాన్సర్ నివారణకు ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
నాలుగు రోజులు మాత్రమే ఆసుపత్రిలో ఉన్నారు
విశేషమేమిటంటే.. కేవలం నాలుగు రోజులు మాత్రమే ఆస్పత్రిలో గడిపిన ఆయన మళ్లీ ఇస్రోకు సేవలందించడం ప్రారంభించారు. రెగ్యులర్‌గా పరీక్షలు, స్కానింగ్‌లు జరుగుతున్నాయన్నారు. కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకుని పని మొదలుపెట్టాను. ఇస్రో చీఫ్ ఆరోగ్యం క్షీణించిందనే వార్త వచ్చిన తరువాత అతని అభిమానుల్లో ఆందోళనలు పెరిగింది.
We’re now on WhatsApp : Click to Join