India: ఇజ్రాయిల్ -పాలస్తీనా యుద్ధం.. 212 మంది ఇండియాకు సురక్షితంగా!
ప్రత్యేక విమానంలో సుమారు 230 మంది భారత పౌరులు స్వదేశానికి చేరుకుంటారు.
- By Balu J Published Date - 11:29 AM, Fri - 13 October 23

India: ఇజ్రాయిల్ -పాలస్తీనా యుద్ధంలో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా 212 మంది ప్రయాణీకులతో కూడిన ఎయిర్ ఇండియా తొలిప్రత్యేక విమానం ఈ రోజు ఉదయం కొత్త దిల్లీకి చేరుకుంది. ఇజ్రాయెల్ లోని తెల్ అవివ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గత రాత్రి బయలు దేరిన ప్రత్యేక విమానంలో సుమారు 230 మంది భారత పౌరులు స్వదేశానికి చేరుకుంటారని భావించారు.
అయితే, 212 మంది మాత్రమే భారత్‌కు తిరిగి వచ్చారు. ఇదిలావుంటే, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ..ఆపరేషన్ అజయ్ సన్నద్ధతపై అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ అజయ్ లో భాగంగా భారతీయుల ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది.
Also Read: MLC Kavitha: దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్, బీజేపీ అన్ని రంగాల్లో విఫలం: ఎమ్మెల్సీ కవిత