HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Indians Death Count Rises To 41 In Nepal Road Accident

Maharashtra : ‘మహా’ విషాదం.. నదిలో పడిన బస్సు.. 41 మంది మృతి

వీరిలో 40 మంది మహారాష్ట్రకు చెందిన యాత్రికులే కాగా, మిగతా ముగ్గురు బస్సులో పనిచేసే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిబ్బంది అని అంటున్నారు.

  • Author : Pasha Date : 24-08-2024 - 9:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indians Death Count In Nepal Accident

Maharashtra : నేపాల్‌లోని తనహున్ జిల్లాలో భారత ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు నదిలో పడిపోయిన ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ బస్సులోని 43 మందిలో 41 మంది చనిపోయారని అధికార వర్గాలు ప్రకటించాయి. వీరిలో 40 మంది మహారాష్ట్రకు చెందిన యాత్రికులే కాగా, మిగతా ముగ్గురు బస్సులో పనిచేసే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిబ్బంది అని అంటున్నారు. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ కూడా ఈ మరణాల వివరాలను ధృవీకరించారు. డెడ్‌బాడీలను తీసుకొచ్చేందుకుగానూ నేపాల్ ప్రభుత్వం, ఢిల్లీలోని నేపాల్(Maharashtra) ఎంబసీతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. ఈక్రమంలో తమకు నేపాల్‌లోని భారత ఎంబసీ నుంచి సహకారం లభిస్తోందన్నారు.

We’re now on WhatsApp. Click to Join

భారతీయ పర్యాటకుల మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చే అంశంపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే..  కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ కేంద్ర అధికారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం షిండేకు అమిత్ షా హామీ ఇచ్చారు. భారతీయ వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం ఆదివారం రోజు 24 మంది పర్యాటకుల మృతదేహాలను నాసిక్‌కు తీసుకువస్తుంది. అనంతరం వాటిని బాధిత కుటుంబాలకు అప్పగిస్తారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ మహారాష్ట్ర సీఎం షిండే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి శుక్రవారం రాత్రి సమయానికి బస్సులోని 43 మందిలో 27 మందే చనిపోయారు. మిగతా 16 మంది క్షతగాత్రులను ఆస్పత్రుల్లో  చేర్పించగా, చికిత్స పొందుతూ 14 మంది ప్రాణాలు విడిచారు.

Also Read :Confirm Train Ticket: రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ట్రైన్‌లో సీటు పొందండిలా..!

మహారాష్ట్రలోని జల్‌గావ్‌‌కు చెందిన యాత్రికులు తొలుత ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేపాల్‌లోని పోఖారాకు చేరుకున్నారు. శుక్రవారం రోజు నేపాల్‌లోని పోఖారా నుంచి రాజధాని ఖాట్మండు వైపు బస్సు వెళ్తుండగా.. మార్గం మధ్యలో తనహున్ జిల్లా ఐనాపహారా వద్ద బస్సు అదుపు తప్పి మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. దాదాపు 150 మీటర్ల ఎత్తు నుంచి నదిలో బస్సు పడటంతో అందులోని 41 మంది చనిపోయారు.

Also Read :Ormax Media Top 10 Actors : టాప్ 1 ప్రభాస్.. ఆర్మాక్స్ టాప్ 10 స్టార్స్ లో ఐదుగురు తెలుగు స్టార్స్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Indians Deaths
  • Maharashtra
  • Nepal
  • Nepal Road Accident

Related News

Gas Effect 4yres

War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినా, దాని తాలూకు ఆర్థిక గాయాలు మానడానికి మరో రెండు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

  • Crime News: స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

  • Spam Calls : స్పామ్ కాల్సు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి..మళ్లీ అలాంటి కాల్స్ ఉండవు !!

  • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

  • Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd