Smallest Washing Machine : ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషీన్… ఎలా పనిచేస్తుందో తెలుసా ?
తన ఇంజినీరింగ్ నైపుణ్యంతో అతిచిన్న వాషింగ్ మెషీన్‌ను(Smallest Washing Machine) తయారు చేసి వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు.
- Author : Pasha
Date : 16-10-2024 - 2:26 IST
Published By : Hashtagu Telugu Desk
Smallest Washing Machine : అదొక వాషింగ్ మెషీన్. దాని సైజు గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వాషింగ్ మెషీన్ పొడవు 1.28 అంగుళాలు, వెడల్పు 1.32 అంగుళాలు, ఎత్తు 1.52 అంగుళాలు. ఇంతచిన్న సైజు వాషింగ్ మెషీన్‌ను తయారు చేసింది మరెవరో కాదు.. మన భారతీయ యువకుడే. ఆయన పేరు సెబిన్ సాజీ. తన ఇంజినీరింగ్ నైపుణ్యంతో అతిచిన్న వాషింగ్ మెషీన్‌ను(Smallest Washing Machine) తయారు చేసి వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం సెబిన్ సాజీ అప్లై చేశాడు. ఈ వాషింగ్ మెషీన్.. వాష్, రిన్స్, స్పిన్ వంటి అన్ని ఫంక్షన్లను చేయగలదు. దీన్ని కొలిచేందుకు ప్రత్యేక డిజిటల్ కాలిపర్స్‌ను సెబిన్ సాజీ ఉపయోగించాడు.
Also Read :World Spine Day 2024: ఈతరానికి ‘టెక్ నెక్’.. వెన్నునొప్పికి కారణాలు ఇవీ!
సెబిన్ సాజీ తన వాషింగ్ మెషీన్‌కు సంబంధించిన విడిభాగాలను కలిపి అసెంబ్లింగ్ చేసిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చిటికెడు వాషింగ్ పౌడర్‌ను తీసుకొని నీరు పోసి దాన్ని ఆన్ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇంత చిన్న వాషింగ్ మెషీన్‌ను సెబిన్ పనిచేయించడం చాలా గొప్ప విషయమని నెటిజన్లు అందరూ పొగొడుతున్నారు. సెబిన్ సాజీ ఇంజినీరింగ్ నైపుణ్యం భళా అని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోకు యూట్యూబ్‌లో, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వ్యూస్ వెల్లువెత్తాయి. ప్రపంచంలోనే అతిచిన్న వ్యాక్యూమ్ క్లీనర్‌ను కూడా ఇటీవల మన దేశంలోనే ఓ ఔత్సాహికుడు తయారుచేశాడు. దాని సైజు 0.65 సెంటీమీటర్లు మాత్రమే.
Also Read :Imran Khan: ఇమ్రాన్ ఖాన్.. ఇద్దరు కొడుకులు.. మాజీ భార్య గోల్డ్‌స్మిత్ సంచలన ట్వీట్
ఎల్‌జీ వాషింగ్ మెషీన్
ఎల్‌జీ కంపెనీ ఏడు కేజీల వాషింగ్ మెషీన్‌ను విడుదల చేసింది. ఇది టర్బోడ్రమ్ టెక్నాలజీతో దుస్తులను ఉతుకుతుంది. ఈ వాషింగ్ మెషీన్ 700 ఆర్ పీఎం అధిక స్పిన్ వేగంతో బట్టలను తిప్పగలదు. ఏడు రకాల వాష్ ప్రోగ్రామ్‌ల నుంచి నచ్చిన దాన్ని మనం ఎంపిక చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ టైంలో 15 నిమిషాల్లోనే దుస్తులను శుభ్రపరిచే క్విక్ వాష్ మోడ్ ఇందులో ఉంది. ఎల్ జీ 7 కేజీల ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ధర దాదాపు రూ.17,490 రేంజులో ఉంది.