HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Indian Army Invitation For Technical Graduates Few More Days Chance To Apply

Technical Graduates : ప్రతినెలా లక్ష శాలరీ.. ఆర్మీలో జాబ్స్..

Technical Graduates :  బీఈ, బీటెక్ చేశారా ? అయితే ఇదే మంచి అవకాశం..

  • By Pasha Published Date - 08:28 AM, Wed - 24 April 24
  • daily-hunt
Army Technical Graduate
Army Technical Graduate

Technical Graduates :  బీఈ, బీటెక్ చేశారా ? అయితే ఇదే మంచి అవకాశం.. నెలకు లక్ష రూపాయల దాకా శాలరీ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది.  చేయాల్సిందల్లా ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్​ (టీజీసీ)కు అప్లై చేయడమే. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్​ఎస్​బీ) ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.  టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. అవివాహిత పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇండియన్ ఆర్మీ వెబ్​సైట్​ https://joinindianarmy.nic.in ద్వారా అప్లై చేయాలి. ఇందుకోసం ఎలాంటి దరఖాస్తు రుసుమును కట్టాల్సిన అవసరం లేదు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 2024 మే 9 .

We’re now on WhatsApp. Click to Join

సివిల్ ఇంజినీరింగ్ వాళ్లకు 7 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ వాళ్లకు  7 పోస్టులు, ఎలక్ట్రికల్  ఇంజినీరింగ్ వాళ్లకు​ 3 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పోస్టులు 4, మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టులు  7, ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో  2 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా కోర్సుల్లో ఫైనలియర్‌లో ఉన్న వాళ్లు కూడా అప్లై చేయొచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ పోస్టులకు ఎమ్మెస్సీ సీఎస్‌/ఐటీ చేసినవాళ్లు కూడా అర్హులే. అభ్యర్థుల వయస్సు 2025 జనవరి 1 నాటికి 20 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపు(Technical Graduates) ఉండాలి. 1998 జనవరి 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించిన వాళ్లే ఈ జాబ్స్‌కు అర్హులు.

Also Read :What is Bha : హమ్మయ్య.. చెప్పుల కష్టాలకు చెక్.. ‘భా’.. వచ్చేస్తోంది!

  • బీటెక్​లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • వీరికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్​బీ) 5 రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్​ టెస్టింగ్​​, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ బెంగళూరు కార్యాలయంలో జరుగుతుంది.
  • మొదటి రోజు స్టేజ్​-1 స్క్రీనింగ్ (ఇంటెలిజెన్స్​) పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో పాసయ్యే వారిని స్టేజ్​-2కు ఎంపిక చేస్తారు.
  • వీరికి 4 రోజుల పాటు పలు విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయ్యే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. అర్హత సాధించిన వారిని ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తారు.
  • ఎంపికయ్యే అభ్యర్థులకు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న ఇండియన్‌ మిలటరీ అకాడమీలో 2024 జనవరి నుంచి ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు.
  • ఈ టైంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ ఇస్తారు.
  • కోర్సు పూర్తయ్యాక ప్రతినెలా రూ.56,100 శాలరీ, రూ.15,500 మిలటరీ సర్వీస్‌ పే చెల్లిస్తారు. వీటికి తోడు డీఏ, ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. అన్నీ కలిపి మొదటి నెల నుంచే రూ.లక్ష దాకా జీతం వస్తుంది.

Also Read : Papala Bhairavadu : రాజకీయ విమర్శనాస్త్రంగా ‘పాపాల భైరవుడు’.. పురాణాల్లో ఏముంది ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian army
  • jobs
  • Technical Graduates

Related News

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd