HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Road Network Now 2nd Longest In World

India Road Network : చైనాను దాటేసిన భార‌త్‌..! ప్ర‌పంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్‌వ‌ర్క్ క‌లిగిన రెండో దేశంగా గుర్తింపు

ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ క‌లిగిన దేశంగా ఇండియా గుర్తింపు పొందింది. దేశంలో మొత్తం రోడ్ల పొడవు సుమారు 43,20,000 కి.మీ.

  • Author : News Desk Date : 27-06-2023 - 7:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Road Network
India Road Network

ప్ర‌పంచ వ్యాప్తంగా అతిపెద్ద రోడ్ నెట్‌వ‌ర్క్ క‌లిగి దేశాల్లో భార‌త‌దేశం (India) రెండో స్థానం (Second position) లో నిలిచింది. మొద‌టి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ (United States) ఉండ‌గా.. చైనా (China) ను దాటేసి భార‌త్ రెండో స్థానంలో నిలిచింది. 2014 నుంచి 1.45 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల రోడ్డు నెట్‌వ‌ర్క్‌ను విస్త‌రించ‌డం ద్వారా భార‌త‌దేశం రెండో స్థానానికి చేరుకుంది. ఈ విష‌యాన్ని కేంద్ర రోడ్డు ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ మీడియా స‌మావేశంలో వివ‌రించారు. త‌న ప‌ద‌వీకాలంలో త‌న మంత్రిత్వ శాఖ సాధించిన విజ‌యాల‌ను ఆయ‌న వివ‌రించారు. తొమ్మిదేళ్ల‌లో భార‌త‌దేశం అనేక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేల‌ను అందుబాటులోకి తెచ్చింద‌ని చెప్పారు. నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆప్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం దాదాపు పూర్తి చేసింద‌ని, ఇది భార‌త‌దేశంలోనే అత్యంత పొడ‌వైన‌ద‌ని గ‌డ్క‌రీ వెల్ల‌డించారు.

తొమ్మిదేళ్ల క్రితం భార‌త‌దేశ ర‌హ‌దారి నెట్‌వ‌ర్క్ 91,287 కిలో మీట‌ర్లుగా ఉంద‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ చెప్పారు. గ‌డిచిన తొమ్మిదేళ్ల‌లో ఎన్‌హెచ్ఏఐ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా కొత్త జాతీయ ర‌హ‌దారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణాన్ని చేప‌ట్టింద‌ని అన్నారు. ఏప్రిల్ 2019 నుంచి ఎన్‌హెచ్ఏఐ 30వేల కిలోమీట‌ర్ల కంటే ఎక్కువ హైవేల‌ను నిర్మిచింద‌ని, ఇందులో ఢిల్లీని మీర‌ట్‌తో అదేవిధంగా ల‌క్నోను యూపీలోని ఘాజీపూర్‌తో క‌లిపే ప్ర‌ధాన ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి చెప్పారు.

ఎన్‌హెచ్ఏఐ రోడ్ల నిర్మాణంలో అనేక ప్ర‌పంచ స్థాయి రికార్డులు నెలకొల్పింది. వాటిలో ఈ ఏడాది మే నెల‌లో యూపీలోని ఘ‌జియాబాద్ – అలీఘ‌ర్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం స‌మ‌యంలో ఎన్‌హెచ్ఏఐ 100 గంట‌ల్లో 100 కిలోమీట‌ర్ల కొత్త ఎక్స్‌ప్రెస్‌వేని నిర్మించి రికార్డు సృష్టించింది. గ‌త ఏడాది ఆగ‌స్టులో ఎన్‌హెచ్ఏఐ-53లో అమ‌రావ‌తి – అకోలా మ‌ధ్య 75 కిలో మీట‌ర్ల నిరంత‌ర సింగిల్ బిటుమిన‌స్ కాంక్రీట్ ర‌హ‌దారిని 105 గంట‌ల 33 నిమిషాల్లో పూర్తి చేసి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు నెల‌కొల్పింది.

ఇదిలాఉంటే తొమ్మిదేళ్ల‌లో టోల్ ఆదాయం భారీగానే పెరిగింది. తొమ్మిదేళ్ల క్రితం రూ. 4,770 కోట్లు ఉన్న టోల్ వ‌సూళ్లు రూ. 41,342కోట్ల‌కు పెరిగాయ‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ మీడియాకు తెలిపారు. కేంద్రం ఇప్పుడు టోల్ ఆదాయాన్ని 1.30ల‌క్ష‌ల కోట్ల‌కు పెంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని నితిన్ గ‌డ్క‌రీ చెప్పారు.

ICC World Cup 2023: ఉప్ప‌ల్ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు.. రెండు మ్యాచ్‌లు ఆడ‌నున్న పాకిస్థాన్ జ‌ట్టు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • India Road network
  • India world Second position
  • United States

Related News

Gas Effect 4yres

War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినా, దాని తాలూకు ఆర్థిక గాయాలు మానడానికి మరో రెండు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

  • Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Jewar Airport : ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని మోడీ శ్రీకారం!

  • Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి

  • వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై 15 రోజులకు ఓసారి పెట్రోల్ , డీజిల్ ధరల్లో మార్పులు

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd