HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Bans Chinese Products

Ban : భారత్ కు చైనా ఉత్పత్తులు బ్యాన్..రైతులకు కష్టాలు తప్పవా..?

Ban : దేశవ్యాప్తంగా పంటల సీజన్ కొనసాగుతున్న తరుణంలో, ఈ ఎరువుల సరఫరా ఆగిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

  • Author : Sudheer Date : 27-06-2025 - 8:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fertilizer Supply
Fertilizer Supply

పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack)కి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్ పై ‘ఆపరేషన్ సింధూర్’(operation sindoor)ను చేపట్టి, అనేక కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సింధు జలాల పంపిణీ నిలిపివేత వంటి చర్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. అయితే ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ మిత్రదేశంగా ఉండే చైనా(China), ఇప్పుడు మౌనంగా భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పాక్‌పై భారత్ ఎలా ఆంక్షలు విధించిందో, అదే రీతిలో చైనా కూడా భారత్‌పై ఆర్థిక పరంగా ఒత్తిడి తేవడానికి రంగంలోకి దిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Lukewarm Water Benefits: ఈ సీజ‌న్‌లో గోరువెచ్చ‌ని నీరు తాగ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే!

ప్రస్తుతం చైనా భారత్‌కు కీలకంగా ఎగుమతి చేసే ఎరువుల సరఫరా పూర్తిగా నిలిపివేసిన నేపథ్యంలో, ఇరు దేశాల వాణిజ్య సంబంధాల్లో తీవ్రతరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పంటల సీజన్ కొనసాగుతున్న తరుణంలో, ఈ ఎరువుల సరఫరా ఆగిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయల సాగుకు ఉపయోగించే ప్రత్యేకమైన ఎరువులు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి అవుతుండటంతో, దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. రైతులు ఈ ఎరువులను ఉపయోగించి అధిక దిగుబడి సాధిస్తున్నందున, చైనా చర్య వల్ల వ్యవసాయ రంగం అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఏర్పడింది.

భారత్ ఏటా దాదాపు 1.5 లక్షల టన్నుల నుంచి 1.6 లక్షల టన్నుల వరకూ చైనా నుంచి ఎరువులను దిగుమతి చేసుకుంటుంది. వీటిలో 80 శాతం కీలకమైన ఎరువులు చైనాపై ఆధారపడినవే. సాధారణంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ ఎరువుల దిగుమతులు జరుగుతుంటాయి. ఇవి భారత మట్టిలో మానవీయతను (soil fertility) పెంచే గుణం కలిగినవని శాస్త్రజ్ఞులు కూడా చెబుతున్నారు. అయితే ఇటీవల అంతర్జాతీయ సంబంధాలలో ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి కారణంగా చైనా ఎరువుల ఎగుమతిని నిలిపివేయడం వల్ల రైతాంగంలో ఆందోళన మొదలైంది. ఇది కేవలం వాణిజ్య సంబంధాలకే కాదు, వ్యవసాయ రంగానికి కూడా పెద్ద షాక్‌గా మారే అవకాశముంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ban
  • china
  • Fertilizer supply
  • Operation Sindoor
  • Pahalgam Terror Attack
  • Pak

Related News

Donald Trump holds call with Xi Jinping

గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు

CHINA vs USA  ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో చైనాపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ఆ దేశం 2020 జూన్‌లో అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా మంత్రి చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. తాజాగా, ఈ ఆరోపణలపై బీజింగ్ స్పందించి.. అమెరికాకు చురకలు అంటించింది. ముందు అమెరికా తన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించాలని కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము ఎటువంటి పరీక్షలు చేయలేదని, అంతర్జాతీయ అణు ని

  • Rahul Gandhi

    రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

Latest News

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

  • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

  • India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ గందరగోళంపై కేంద్రమంత్రి క్షమాపణలు

  • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

  • టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

Trending News

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd