Gujarath : వామ్మో.. విక్రమ్ సినిమా రేంజులో గుజరాత్ లో 1125 కోట్ల డ్రగ్స్ సీజ్
గుజరాత్ లో భారీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్. వదోదర పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీపై దాడి చేశారు.
- By hashtagu Published Date - 11:58 AM, Thu - 18 August 22

గుజరాత్ లో భారీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్. వదోదర పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీపై దాడి చేశారు. అక్కడ దాదాపు 225 కిలోల మెఫెడ్రోన్ మత్తు పదార్థం బయటపడింది. దీని విలువ రూ. 1,125 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఫ్యాక్టరీ భాగస్వాములు 5గురితోపాటు, దినేష్ ధ్రువ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను బరూచ్ జిల్లా సాంఖ్య జీఐడీసీలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్లు తెలిసింది. ధ్రువ్ నార్కోటిక్స్ కేసులో గతలో 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినట్లు అధికారులు గుర్తించారు.