India vs Bharat: ఇండియా భారత్ గా మారితే..?
ఇండియా' పేరును 'భారత్'గా మార్చడంపై నేడు సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డియోన్ నాష్ తన కుమార్తెకు ఇండియా లిల్లీ నాష్ అని పేరు పెట్టారు
- By Praveen Aluthuru Published Date - 08:38 PM, Tue - 5 September 23

India vs Bharat: ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చడంపై నేడు సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డియోన్ నాష్ తన కుమార్తెకు ఇండియా లిల్లీ నాష్ అని పేరు పెట్టారు. బహుశా కూతురికి పెట్టిన పేరు వల్ల అతను బాధపడొచ్చని అంటున్నారు. ఎప్పుడైతే ఇండియా అనే పదాన్ని తొలగిస్తారో అప్పుడు దేశంలో అనేక మార్పులు జరుగుతాయి అంటున్నారు. దేశానికి గుర్తింపు అదేవిధంగా గర్వంగా చెప్పుకునే ఇండియా గేట్ పేరు ఏమని సంబోధిస్తారు. ఇండియా గేట్‌ను భారత్ ద్వార్ అని పిలుస్తారా? ఇటీవల చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 పంపి ఇస్రో చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పుడు ఇస్రోని (ISRO) బిస్రో (BSRO)గా మారుస్తారా ఇలాంటి ప్రశ్నలను కొందరు లేవనెత్తుతున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ని ఇప్పుడు భారత్ ఇన్‌స్టిట్యూట్ మార్చితే ఎలా ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఖేలో ఇండియా, స్కిల్ ఇండియా, ఆల్ ఇండియా రేడియో IPS, IAS, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇలా ఇండియాతో ముడిపడి ఉన్న పేర్లు ఏమవ్వాలి. అంతెందుకు ఐ లవ్ మై ఇండియా స్లోగన్ ఎంతగా ప్రజాధారణ పొందిందో తెలిసిందే. మరి ఇప్పుడు ఇండియా పదమే లేకపోతే ఈ పేర్లకు వాల్యూ ఉంటుందా?
Also Read: Heart Attack : కరోనా వ్యాక్సిన్ తో.. గుండెపోటు ముప్పు ఉందా ? తాజా అధ్యయనం ఏం చెబుతోంది?