Kashi Temple : ప్రయాగ్‌రాజ్ టు కాశీ.. విశ్వనాథుడి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ
కాశీ నగరంలోని కూడళ్లు, గంగా ఘాట్‌లు, ప్రధాన దేవాలయాల(Kashi Temple) వద్ద పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
- By Pasha Published Date - 01:39 PM, Mon - 17 February 25

Kashi Temple : ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుడి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. త్వరలో మహాశివరాత్రి సమయంలో ఈ రద్దీ మరింత పెరగనుంది. జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా జరుగుతోంది. అక్కడున్న త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాల కోసం భక్తజనం తరలి వస్తున్నారు. అక్కడి నుంచి ఎంతోమంది భక్తజనం అయోధ్య, కాశీ ఆలయాల సందర్శనకు వస్తున్నారు. అందువల్లే ఇప్పుడు కాశీలోని విశ్వనాథుడి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. భారీగా భక్తులు తరలి వస్తున్నందున, వారి సౌకర్యార్ధం ఏర్పాట్లు చేస్తున్నారు. కాశీ నగరంలోని కూడళ్లు, గంగా ఘాట్‌లు, ప్రధాన దేవాలయాల(Kashi Temple) వద్ద పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
Also Read :Watermelon Rind : పుచ్చకాయ తొక్క.. పురుషులకు షాకింగ్ బెనిఫిట్
కాశీకి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నందున విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశామని కాశీ జోన్ డీసీపీ గౌరవ్ బన్సల్ తెలిపారు. జనసమూహ నిర్వహణలో భాగంగా ప్రధాన ప్రవేశ పాయింట్లు, నిష్క్రమణ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. కాశీ ఘాట్ల వద్ద పోలీసు బలగాలతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, జల పోలీసుల బృందాలను మోహరించారు. జనసమూహాన్ని నియంత్రించడానికి విశ్వనాథ్ ఆలయం నుంచి భదౌరియా స్క్వేర్ వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కాశీ విశ్వనాథుడి దర్శన ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటానికి ప్రవేశ మార్గాలను జిగ్-జాగ్ నమూనాలో ఉంచారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి, శివుడిని దర్శించుకుంటున్నారు.
Also Read :Dadasaheb Phalke : భారతీయ సినిమా పితామహుడు.. దాదాసాహెబ్ ఫాల్కే గురించి తెలుసా ?
రెండు గంటలుగా క్యూలైన్‌లో ఉన్నాం
“మేం రెండు గంటలుగా ఇక్కడ (కాశీ ఆలయంలో) నిలబడి ఉన్నాం. మోతీ నుంచి రావడానికి ఒక గంట పట్టింది. కాశీలో చాలా జనసమూహం ఉంది. ఇక్కడి ప్రతి వీధిలోనూ భక్తజనం కనిపిస్తున్నారు’’ అని నాగ్‌పూర్‌కు చెందిన నీలా దేశ్‌పాండే అనే భక్తురాలు చెప్పారు.
నాలుగు గంటలుగా క్యూ లైనులో..
“ఇక్కడ (కాశీ ఆలయంలో) చాలా రద్దీ ఉంది. మేం గత నాలుగు గంటలుగా క్యూ లైనులో నిలబడి ఉన్నాం. అయినా ఇంకా దర్శనం చేసుకోలేకపోయాం. నేను చాలా దూరం నుంచి వచ్చాను. దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్తాను” అని గుజరాత్‌లోని ఆనంద్ నుంచి వచ్చిన అరవింద్ పటేల్ చెప్పారు.
సోమవారం కాబట్టి..
“ఈరోజు సోమవారం కాబట్టి జనసమూహం పెరిగింది. కానీ మేం పూర్తి భక్తితో దర్శనం కోసం క్యూలైన్లలో వేచి చూస్తున్నాం’’ అని జార్ఖండ్‌కు చెందిన భక్తుడు ఆర్‌కే సిన్హా తెలిపాడు.