Chandrayaan-3 Journey Pictures : చంద్రయాన్ 3పై అమర్చిన కెమెరా పంపిన ఫోటోలు చూశారా !
Chandrayaan-3 Journey Pictures : చంద్రయాన్-3 ప్రయోగాన్ని మనమంతా నిన్న(శుక్రవారం) లైవ్ లో చూశాం..కానీ ఆ సీన్స్ ను మనం సరిగ్గా ఆ లాంచ్ వెహికల్ పై నిలబడి చూస్తే.. ఇంకా ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా !!
- By Pasha Published Date - 12:48 PM, Sat - 15 July 23

Chandrayaan-3 Journey Pictures : చంద్రయాన్-3 ప్రయోగాన్ని మనమంతా నిన్న(శుక్రవారం) లైవ్ లో చూశాం..
నిప్పులు చిమ్ముతూ రాకెట్ లాంచ్ వెహికల్ నింగిలోకి దూసుకెళ్లడం మనకు కనిపించింది.
కానీ ఆ సీన్స్ ను మనం సరిగ్గా ఆ లాంచ్ వెహికల్ పై నిలబడి చూస్తే.. ఇంకా ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా !!
అయితే మనకు ఆ పని లేకుండానే.. మొత్తం చంద్రయాన్-3 ప్రయోగాన్ని, చంద్రుడి దిశగా లాంచ్ వెహికల్ జర్నీని మన కళ్ళకు కట్టింది ఆన్‌బోర్డ్ కెమెరా !!
ఇది లాంచ్ వెహికల్ (రాకెట్) లో ఎగువ భాగపు క్రయోజనిక్ ఇంజన్ కొనలో బిగించి ఉంటుంది.
ఆన్‌బోర్డ్ కెమెరా.. లాంచ్ వెహికల్ ప్రతి యాక్టివిటీని ఫోటోలు, వీడియోలు తీసి ఇస్రో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పంపుతుంది.
మనం కూడా ఇస్రో విడుదల చేసిన ఆ థ్రిల్లింగ్ ఫోటోలను ఒకసారి చూద్దాం..
చంద్రయాన్ 3 జర్నీ ఎలా జరిగిందో ఫోటోలతో సహా తెలుసుకుందాం..

చంద్రయాన్ 3 ప్రయోగానికి ముందు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్‌పై నిలబడి ఉన్న రాకెట్..
చంద్రయాన్ 3 ప్రయోగానికి కౌంట్ డౌన్ ముగిసిన వెంటనే రాకెట్ కు రెండు వైపులా ఉన్న చెరొక స్ట్రాపాన్ థ్రస్టర్‌లకు అమర్చి ఉన్న రెండు పెద్ద ఇంజన్‌లు ఆన్ అయ్యాయి. వాటితో పాటే రాకెట్ ఇంజన్ కూడా ఆన్ అయింది. ఈక్రమంలో వెలువడే మంటలను అప్పటికప్పుడు ఆర్పడానికి.. రాకెట్ చుట్టూ అమర్చి ఉన్న పైపుల ద్వారా భారీ ఒత్తిడితో నీటిని నిప్పుల వైపుకు వదిలారు. దీన్ని ఈ ఫోటోలో మీరు చూడొచ్చు.
