Excise Policy Case: రామచంద్ర పిళ్లై మధ్యంతర బెయిల్ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై మధ్యంతర బెయిల్‌ను జనవరి 8వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించింది.
- Author : Praveen Aluthuru
Date : 04-01-2024 - 5:31 IST
Published By : Hashtagu Telugu Desk
Excise Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై మధ్యంతర బెయిల్‌ను జనవరి 8వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించింది.
హైదరాబాద్‌లో అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసుకునేందుకు ఉపశమనం కోరిన పిళ్లై, గతంలో పొడిగించిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ముందు హాజరుపరిచారు. పిళ్లై తరపున రూస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ముందు హాజరైన న్యాయవాది నితీష్ రాణా తన క్లయింట్ భార్య తీవ్ర అనారోగ్యంతో ఉన్నందున ఆమెకు శస్త్రచికిత్స చేయవలసి ఉందని పేర్కొన్నారు. ఒంటరిగా బతుకుతున్న ఆమెను చూసుకునేందుకు ఎవరూ లేరని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విచారించిన కోర్టు అరుణ్ రామచంద్ర పిళ్లై మధ్యంతర బెయిల్‌ను జనవరి 8వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. గత ఏడాది నవంబర్ మార్చి 6న అరెస్టయిన పిళ్లైకి కోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Also Read: South Africa vs India : దెబ్బ అదుర్స్ కదూ.. రెండో టెస్టులో సఫారీలు చిత్తు..