Gujarat : 100 దాటిన మృతుల సంఖ్య, 70మందికి గాయాలు, 50మందికిపైగా గల్లంతు..!!
- By hashtagu Published Date - 04:24 AM, Mon - 31 October 22

గుజరాత్ లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన తెలిగిపోవడంతో వందల మంది నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో వందమంది మరణించారు. 70మందికి గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని నదిలో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 50మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ వంతెనను మరమ్మతుల అనంతరం ఈ మధ్యే ప్రారంభించారు.
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై సమీక్ష నిర్వహించాను. ఐదుగురు సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై పెద్దెత్తున జనం ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో స్థానికులు పోలీసులకు సహాయం చేస్తున్నారు. ఎన్ డిఆర్ఎఫ్, ఎస్ డిఆర్ఎఫ్ లకు చెందిన మూడు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రమాద తీవ్రతను బట్టి వైమానిక దళం గరుడ్ కమాండోలను ఘటనాస్థలానికి పంపించింది.