IRCTC Good News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
IRCTC Good News: ఇప్పటి వరకూ రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మ్ (Ticket Confirmation) అయినదో కాదో చివరి నిమిషంలో అంటే రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు మాత్రమే తెలుసుకునే అవకాశం ఉండేది
- By Sudheer Published Date - 03:55 PM, Sun - 15 June 25

భారతదేశంలో కోట్లాదిమంది ప్రజలు రైళ్లను తమ ప్రధాన ప్రయాణ సాధనంగా వినియోగిస్తారు. అందులో ఎక్కువ మంది రిజర్వేషన్ కోచ్‌లను ఎంచుకుంటారు. అయితే ఇప్పటి వరకూ రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మ్ (Ticket Confirmation) అయినదో కాదో చివరి నిమిషంలో అంటే రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు మాత్రమే తెలుసుకునే అవకాశం ఉండేది. దీనివల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలపై నిర్ణయం తీసుకోవలేని పరిస్థితులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ కొత్త రూల్‌ను రూపొందించింది.
Vijay Rupani: గుజరాత్ మాజీ సెం విజయ్ రూపాణీ భౌతికకాయం గుర్తింపు.
ఇకపై రైలులో వెయిటింగ్ లిస్ట్(Waiting List)లో ఉన్న ప్రయాణికులకు రైలు బయలుదేరే 24 గంటల ముందే టికెట్ స్టేటస్ తెలియజేయనున్నారు. రైల్వే శాఖ తాజా మార్పుతో ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేసుకునే వీలుంటుంది. టికెట్ కన్ఫర్మ్ కాకపోతే బస్సు, ప్రైవేట్ వాహనాలు వంటి ప్రత్యామ్నాయాలపై యోచించేందుకు సమయం దొరుకుతుంది. దీని వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, ఎలాంటి ఆందోళన లేకుండా సాగుతుంది.
ఈ కొత్త విధానాన్ని మొదటగా బికనీర్ రైల్వే డివిజన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ట్రయల్ విజయవంతం కావడంతో రైల్వే శాఖ దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన జోన్‌లకు ఇది వర్తింపజేయనుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలో ఢిల్లీ, ముంబై లాంటి ముఖ్య రైలు మార్గాల్లో ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. అధికారికంగా అమలులోకి వచ్చే తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం. ఇది అమలులోకి వస్తే దేశంలోని ప్రయాణికుల కోసం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.