HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Ahmedabad Plane Crash Vijay Rupani Dna Confirmation

Vijay Rupani: గుజరాత్‌ మాజీ సెం విజయ్‌ రూపాణీ భౌతికకాయం గుర్తింపు.

Vijay Rupani: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సమీపంలో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం మళ్లీ ఒక్కసారి దుఃఖాన్ని మిగిల్చింది.

  • By Kavya Krishna Published Date - 02:52 PM, Sun - 15 June 25
  • daily-hunt
Vijay Rupani
Vijay Rupani

Vijay Rupani: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సమీపంలో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం మళ్లీ ఒక్కసారి దుఃఖాన్ని మిగిల్చింది. ఈ ఘోర ఘటనలో మృతి చెందిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపాణీ ఉన్నట్లు అధికారికంగా ధృవీకరించబడింది. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదం జరిగిన మూడురోజుల తర్వాత డీఎన్‌ఏ పరీక్షల ద్వారా రూపాణీ మృతదేహాన్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు. రూపాణీ కుటుంబసభ్యుల జన్యు నమూనాల తో పోల్చిన డీఎన్‌ఏ విశ్లేషణ ఫలితాల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబానికి అప్పగించినట్లు చెప్పారు.

ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 32 మృతుల డీఎన్‌ఏ నమూనాలు వారి కుటుంబాల నమూనాలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల వైద్యులు తెలిపారు. వీరిలో 14 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. డీఎన్‌ఏ పరీక్ష అవసరం లేకుండా బంధువులు గుర్తించిన 8 మృతదేహాలను ఇప్పటికే అప్పగించినట్లు వెల్లడించారు. ప్రమాద తీవ్రత కారణంగా పలువురు మరణించినవారిని శరీరాలను గుర్తించడానికి పెద్ద కష్టాలు ఎదురవుతున్నాయి. కాలిన శరీరాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు తప్పదని వైద్యులు చెబుతున్నారు. ఒక్కో పరీక్ష పూర్తయ్యేందుకు సమయం ఎక్కువగా పడుతుండటంతో ఈ ప్రక్రియకు ఆలస్యం అవుతోంది.

ప్రస్తుతం బాధితుల కుటుంబాలకు సమాచారాన్ని అందించేందుకు 230 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 11 మంది విదేశీయుల కుటుంబాలతో కూడా సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

TTD : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ahmedabad
  • Air Crash Victims
  • disaster response
  • DNA Identification
  • gujarat
  • gujarat government
  • Harsh Sanghvi
  • Indian Politics
  • plane crash
  • Vijay rupani

Related News

Let's develop Telangana with Rising 2047: CM Revanth Reddy

CM Revanth Reddy : రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తాం.. కేరళలో రగల్చిన రేవంత్ రెడ్డి..!

CM Revanth Reddy : ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ ని ప్రశంసిస్తూ, తెలంగాణ, కేరళలో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి, అలాగే దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు.

    Latest News

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd