HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Gone Are The Days Of Stone Pelting In Kashmir Amit Shah

Terrorism : కశ్మీర్‌లో రాళ్లురువ్వే రోజులు పోయాయి: అమిత్‌ షా

  • By Latha Suma Published Date - 04:53 PM, Fri - 21 March 25
  • daily-hunt
Immigration Bill
Immigration Bill

Terrorism : శుక్రవారం రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్‌ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్‌ రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్‌ షా వెల్లడించారు. కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అనుసరిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.

Read Also: Rajya Sabha : ఒక్క రాజ్యసభ సీటు.. రేసులో ఇద్దరు కీలక నేతలు

కశ్మీర్‌లో ఇప్పుడు యువకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు. సినిమాహాళ్లు నిండుతున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వాల పనితీరుపై మండిపడ్డారు. అవి ఉగ్రవాదుల పట్ల మెతకవైఖరి అనుసరించాయని దుయ్యబట్టారు. ఇప్పుడు కశ్మీర్‌లో సాయంత్రం పూట కూడా సినిమాహాళ్లు తెరిచే ఉంటున్నాయి. జీ20 సమావేశాలు జరిగాయి. 2019 నుంచి 2024 వరకు అక్కడి యువతకు 40వేల ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య, పెట్టుబడులు పెరిగాయి. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య భారతంలోని ఉగ్రవాదం, తీవ్రవాదం దేశ వృద్ధికి ఆటంకాలు. వాటి వల్ల 92వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

మోడీ ప్రభుత్వ పాలనలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం వల్ల మరణాలు 70 శాతం తగ్గాయి. ఉగ్రఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’ అనే రాజ్యాంగ నిర్మాతల కలను మోడీ ప్రభుత్వం నెరవేర్చింది. మా ప్రభుత్వ హయాంలో నక్సలిజాన్ని దాదాపుగా రూపుమాపాం. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఉగ్రవాదాన్ని జీరో టోలరెన్స్ విధానంతో కఠినంగా అణిచివేశాం కశ్మీర్‌లో రాళ్లురువ్వే సంఘటనలు పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే మా హయాంలో కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు చాలా వరకు తగ్గిపోయాయి. వేర్పాటు వాదానికి ఆర్టికల్ 370 మూల కారణం. పిఎఫ్ఐ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించాం. బింద్రే సానుభూతిపరులను జైలు ఊచలు లెక్కబెట్టించాము అని అమిత్‌ షా వివరించారు.

Read Also: Electricity Tariff Hike : విద్యుత్ చార్జీల పెంపు పై TGSPDCL సీఎండీ కీలక ప్రకటన

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jammu kashmir
  • Modi government rule
  • terrorism
  • Union Home Minister Amit Shah
  • Vote bank politics

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

    Latest News

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd