Gold Price Today: పండగ పూట పెరిగిన పసిడి ధరలు.. వెండి ధరలివే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మళ్లీ పెరిగాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది.
- Author : Gopichand
Date : 30-03-2023 - 8:25 IST
Published By : Hashtagu Telugu Desk
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మళ్లీ పెరిగాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 75,700 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (మార్చి 30, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,820గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,490గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,670 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,720గా ఉంది.
Also Read: Bhadrachalam History: భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి వారి చరిత్ర..!
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,000 ఉండగా, ముంబైలో రూ.73,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700 ఉండగా, కోల్‌కతాలో రూ.73,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,700 ఉండగా, కేరళలో రూ.75,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,700 ఉండగా, విజయవాడలో రూ.75,700 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.