Today Gold And Silver Rate: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు..!
దేశంలో బంగారం, వెండి ధరలు (Gold, Silver Price Today) మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో జనవరి 25న బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,490గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో ఈ రేట్లే కొనసాగుతున్నాయి.
- By Gopichand Published Date - 08:15 AM, Wed - 25 January 23
దేశంలో బంగారం, వెండి ధరలు (Gold, Silver Price Today) మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో జనవరి 25న బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,490గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో ఈ రేట్లే కొనసాగుతున్నాయి. కాగా హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 74,000 పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు బుధవారం ఈ విధంగా ఉన్నాయి. ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (జనవరి 25, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,650గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,420గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,700 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,490 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550గా ఉంది. ఇకపోతే.. హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,700 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,490గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.52,700 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,490గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,500 ఉండగా, ముంబైలో రూ.72,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, కోల్కతాలో రూ.72,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, కేరళలో రూ.74,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, విజయవాడలో రూ.74,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.
Related News
Gold- Silver Prices: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అక్షయ తృతీయ నాడు బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్న వారికి శుభవార్త.