Ghulam Nabi Azad Resigns: కాంగ్రెస్ కు గులాంనబీ ఆజాద్ గుడ్ బై
సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
- Author : CS Rao
Date : 26-08-2022 - 12:01 IST
Published By : Hashtagu Telugu Desk
సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి బిగ్ షాక్ తగిలింది. జీ 23 మెంబర్ గా ఉన్న ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజ్యసభ పదవిని ఆశించిన ఆయన ఇటీవల సోనియాను కలిశారు. కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన గురించి చర్చించారు.
ఇటీవలే ఆజాద్ ను జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ బాధ్యతను స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, బీజేపీ మాత్రం ఆజాద్‌కు అరుదైన గౌవరం ఇచ్చింది. ఈ ఏడాది పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది.
#BREAKING: Top Congress leader Ghulam Nabi Azad resigns from all posts and primary membership of the Congress party. “Indian National Congress has lost both the will and the ability under the tutelage of the coterie that runs the AICC to fight for what is right for India”. pic.twitter.com/mQgbSdQB41
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 26, 2022