Gaganyaan Mission : గగన్‌యాన్ ప్రయోగంలో గంటన్నర జాప్యం.. ఎందుకు ?
Gaganyaan Mission : గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఈరోజు 8 గంటలకు జరగాల్సిన ‘క్రూ మాడ్యూల్ ఎస్కేప్’ ప్రయోగ పరీక్ష వాయిదా పడింది.
- By Pasha Published Date - 10:09 AM, Sat - 21 October 23

Gaganyaan Mission : గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఈరోజు 8 గంటలకు జరగాల్సిన ‘క్రూ మాడ్యూల్ ఎస్కేప్’ ప్రయోగ పరీక్షలో జాప్యం చోటుచేసుకుంది. ఈ ప్రయోగంలో వినియోగించే టీవీ-డీ1 రాకెట్ ఇంజిన్‌లో ఇగ్నిషన్ లోపాన్ని ఇస్రో గుర్తించింది. దీంతో ప్రయోగ పరీక్షను దాదాపు గంటన్నర పాటు ఆపారు. రాకెట్ లోని ఇంజిన్ మండకపోవడం వల్ల గగన్‌యాన్ మాడ్యూల్ పరీక్షను వెంటనే నిర్వహించలేదు. ఈనేపథ్యంలో ప్రయోగ పరీక్షను మళ్లీ ఏ టైంలో చేపడతామనే దానిపై త్వరలోనే ప్రకటన చేస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉండగా.. తొలుత వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో టీవీ-డీ1 ప్రయోగాన్ని 8.45 నిమిషాలకు వాయిదా వేశారు. అయితే 8.45 గంటలకు రాకెట్ లోని ఆటోమెటిక్ లాంచ్ సీక్వెన్స్‌లో లోపం తలెత్తింది. దీంతో ప్రయోగ పరీక్షను మళ్లీ ఆపేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇస్రో చీఫ్ ఏమన్నారంటే..
‘‘ఇంజిన్ లో ఇగ్నిషన్ ప్రక్రియ నార్మల్‌గా జరగడం లేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో పరీక్షిస్తాం. లాంచ్ వెహికల్ సేఫ్‌గానే ఉంది. ఆటోమెటిక్ లాంచ్ సీక్వెన్స్ ఎందుకు ఆగిందో విశ్లేషిస్తాం. విశ్లేషణ పూర్తయిన తర్వాత మళ్లీ ప్రయోగ సమయాన్ని ప్రకటిస్తాం. ఆటోమెటిక్ సీక్వెన్స్‌లో లోపం ఉన్నట్లు కంప్యూటర్ గుర్తించింది. దీంతో లాంచింగ్‌ను తాత్కాలికంగా ఆపేశాం’’ అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (Gaganyaan Mission) వివరించారు.
TV D1 Test Flight
Liftoff attempt couldn't be completed.
Updates will follow.
— ISRO (@isro) October 21, 2023
Also Read: Gruha Lakshmi Scheme : ఆ ప్రాంతాల్లో ‘గృహలక్ష్మి’ అమలుపై హైకోర్టు స్టే
గగన్ యాన్ ఎందుకు ?
- మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం ఇస్రో చేపడుతున్న కార్యక్రమమే గగన్‌యాన్.
- 2025 మార్చినాటికి ముగ్గురు వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో లోఎర్త్ ఆర్బిట్‌లో మూడు రోజులు ఉంచి, సురక్షితంగా భూమి మీదికి తిరిగి తీసుకురావడమే మానవసహిత గగన్ యాన్ ప్రయోగం అంతిమ లక్ష్యం.
- ఈ మిషన్‌లో భాగంగా 20 రకాల విభిన్నమైన పరీక్షలు, 3 మానవ రహిత ప్రయోగాలు కూడా చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది.
- ఈ 20 రకాల పరీక్షల్లో భాగంగానే క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికిల్ ప్రయోగాన్ని ఇవాళ నిర్వహిస్తున్నారు.
- ఈ ప్రయోగాలన్నీ విజయవంతంగా పూర్తయితే 2025లో మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నారు.