G20 Summit Delegates: G20 ప్రతినిధులకు బంగారం, వెండి పూత పూసిన పాత్రల్లో భోజనం..!
జీ-20 సదస్సుకు హాజరయ్యే అతిథుల (G20 Summit Delegates) కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే బంగారు, వెండి పూత పూసిన పాత్రలలో అతిథులకు ఆహారం అందించనున్నారు.
- By Gopichand Published Date - 06:27 AM, Thu - 7 September 23

G20 Summit Delegates: జీ-20 సదస్సుకు హాజరయ్యే అతిథుల (G20 Summit Delegates) కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే బంగారు, వెండి పూత పూసిన పాత్రలలో అతిథులకు ఆహారం అందించనున్నారు. జైపూర్‌కు చెందిన మెటల్‌వేర్ సంస్థ ఐఆర్‌ఐఎస్ ఇండియా సీఈవో రాజీవ్ పబువాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పాత్రల స్పెషాలిటీని ఐఆర్ఐఎస్ ఇండియా సీఈవో చెప్పారు.
ఓ వార్తా సంస్థతో సంభాషణలో రాజీవ్ పబువాల్ మాట్లాడుతూ..మేము జనవరి 2023 నుండి సన్నాహాలు ప్రారంభించాము. ఒక్కో ప్రాంతంలో ఒక్కో నగరానికి అనుగుణంగా క్రమంగా ఈ ఉత్పత్తులన్నింటినీ తయారు చేశాం. అతిథుల కోసం ఏర్పాట్లను సిద్ధం చేయడంపై కళాకారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒక్కో డిజైన్ వెనుక ఒక్కో ఆలోచన ఉంటుంది.
Also Read: Transgenders: ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ.1000 ఫించన్
#WATCH | Delhi: Delegates of the G20 Summit to be served in silverware and gold utensils pic.twitter.com/1f2Zm0wGTL
— ANI (@ANI) September 6, 2023
ఇందులో భారతీయత సంప్రదాయం కనిపించేలా ప్రత్యేకంగా తయారు చేశారు. వీటిలో భారత సంస్కృతి సంప్రదాయాలన్నీ కనిపించనున్నాయి. ఈ పాత్రల తయారీలో 200 మంది కళాకారుల శ్రమ ఉంది. కర్నాటక, బెంగాల్, ఉత్తరప్రదేశ్, జైపూర్, ఉత్తరాఖండ్ వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ పాత్రల తయారీలో పనిచేశారన్నారు. ఈ వెండి పాత్రలను హస్తకళాకారులు కష్టపడి తయారు చేశారన్నారు.
అతిథుల కోసం ప్రత్యేకంగా డిన్నర్ సెట్‌ను సిద్ధం చేశారు. డిన్నర్ సెట్‌లో వెండి వస్తువులు, బంగారు పూత పూసిన గిన్నెలు, సాల్ట్ స్టాండ్, స్పూన్ ఉన్నాయి. గిన్నె, గ్లాస్, ప్లేట్‌కు రాయల్ లుక్ ఇచ్చారు. దీనితో పాటు, ట్రేలు, ప్లేట్లలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తాయి.
పాత్రల మీద బంగారం, వెండి పూత
రాజీవ్ పబువాల్ మాట్లాడుతూ.. మేము విభిన్నమైన థాలీ కాన్సెప్ట్‌లను ఏర్పాటు చేశాం. మన రాచరిక రాష్ట్రాలలో మహారాజులు ఆహారం తినేవారు, అదేవిధంగా మేము వివిధ ప్రాంతాలకు మహారాజా తాలీని తయారు చేసాము. ఇందులో గిన్నెలు వెండి పూత, బంగారు పూతతో కూడిన వస్తువులు కూడా ఉంటాయి. మా బృందం వివిధ ప్రాంతాలు, ప్రదేశాలు, నగరాల ప్రకారం వీటిని తయారు చేశాం. మన భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి.. భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి చూపించడానికి మేము ప్రయత్నించామన్నారు.
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జి-20 సదస్సు జరుగుతుంది. ఈసారి ఈ సదస్సుకు భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. G-20 గ్రూప్‌లో చేర్చబడిన దేశాల నాయకులు వారి సంబంధిత ప్రతినిధి బృందాలకు నాయకత్వం వహిస్తారు.