Ajay Jadeja : మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఇక జామ్‌నగర్ మహారాజు
పాండవులు 14 ఏళ్ల అజ్ఞాత వాసాన్ని ముగించుకొని విజయం సాధించిన రోజు దసరా.. అందుకే ఇవాళ అజయ్ జడేజాను(Ajay Jadeja) మా రాజ కుటుంబ వారసుడిగా ప్రకటిస్తున్నాం’’
- By Pasha Published Date - 02:20 PM, Sat - 12 October 24

Ajay Jadeja : అజయ్ జడేజా.. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌గా మనకు సుపరిచితం. అయితే ఆయనకు బంపర్ ఆఫర్ దక్కిింది. జడేజాను గుజరాత్‌లోని జామ్‌నగర్ రాజ కుటుంబ వారసుడిగా ప్రకటించారు. జామ్‌నగర్ రాజ కుటుంబ వారసుడిని జాం సాహెబ్(మహారాజు) అని పిలుస్తుంటారు. ప్రస్తుత జాం సాహెబ్(మహారాజు)గా శత్రుసల్య సింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ జడేజా ఉన్నారు. అజయ్ జడేజా తమ రాజకుటుంబ వారసత్వ సింహాసనాన్ని అధిష్టిస్తారని శత్రుసల్య వెల్లడించారు. ‘‘పాండవులు 14 ఏళ్ల అజ్ఞాత వాసాన్ని ముగించుకొని విజయం సాధించిన రోజు దసరా.. అందుకే ఇవాళ అజయ్ జడేజాను(Ajay Jadeja) మా రాజ కుటుంబ వారసుడిగా ప్రకటిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. గుజరాత్‌లోని ఒకప్పటి రాచరిక సంస్థానం పేరు నవానగర్. దాన్నే ఇప్పుడు మనం జామ్‌నగర్‌గా పిలుస్తున్నాం.
Also Read :Cyber Attacks : ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైబర్ దాడులతో కలకలం
- జామ్‌నగర్ రాజకుటుంబానికి చెందిన అజయ్ జడేజా క్రికెటర్‌గా మంచిపేరు సంపాదించారు.
- జడేజా 1992-2000 వరకు 15 టెస్ట్ మ్యాచ్‌లు, 196 వన్డేలు ఆడారు.
- క్రికెట్‌లో నిర్వహించే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లకు వీరి కుటుంబసభ్యులైన కేఎస్ రంజిత్‌సింహ్‌జీ , కేఎస్ దులీప్‌సింహ్‌జీ పేర్లనే పెట్టడం విశేషం.
- 1996 సంవత్సరంలో బెంగుళూరులో జరిగిన క్రికెట్ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ గొప్ప విజయం సాధించింది. ఆ టైంలో ఇండియా టీమ్ కెప్టెన్ అజయ్ జడేజానే. పాక్‌పై చివర్లో అజయ్ జడేజా 25 బంతుల్లోనే 45 పరుగులు చేశారు.
- ఫీల్డింగ్‌లో జడేజా మెరుపులు చాలానే ఉన్నాయి.
- ఈ ఏడాది ఆగస్టులో పోలాండ్‌లోని వార్సాలో ఉన్న నవానగర్ మెమోరియల్‌లోని జామ్ సాహెబ్ వద్ద ప్రధాని మోడీ నివాళులర్పించారు. రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఎంతో మంది పోలండ్ వాసులకు నవా నగర్‌లో ఆశ్రయం కల్పించిన ఘనత ఆనాటి జాంనగర్ రాజుకు చెందుతుందని మోడీ కొనియాడారు.
- ప్రపంచ ఖ్యాతిని కలిగిన జామ్ నగర్ రాజకుటుంబ వారసత్వ పీఠాన్ని అజయ్ జడేజా అధిరోహించనుండటం విశేషం.