5 Killed : ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. ఇంటికి నిప్పంటుకుని ఐదుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.
- By Prasad Published Date - 08:49 AM, Wed - 28 December 22

ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. ఓ మహిళ..నలుగురు చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మౌ జిల్లాలోని కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం గ్యాస్ లీక్ కావడం అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వెల్లడైంది. డీఐజీ అఖిలేష్ కుమార్, జిల్లా మేజిస్ట్రేట్ అరుణ్ కుమార్, ఎస్పీ అవినాష్ పాండే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి..దర్యాప్తు ప్రారంభించారు. గుడ్డి దేవి అనే మహిళ తన పిల్లలతో కలిసి గుడిసెలో ఉండగా.. పొయ్యి నుండి నిప్పురవ్వ రావడంతో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆమెతో పాటు ఆమె నలుగురు పిల్లలు చనిపోయారు. గుడ్డిదేవి భర్త రమాశంకర్ వేరేచోట పనిచేస్తున్నాడు.