Kannada Language : ‘కన్నడ’ భయం.. బెంగళూరును వీడనున్న కంపెనీ
Kannada Language : ఈక్వల్ లైఫ్ (Equal Life) అనే ప్రైవేట్ సంస్థ బెంగళూరును వీడి మహారాష్ట్రలోని పుణే నగరానికి తరలిపోవాలని నిర్ణయం తీసుకుంది
- By Sudheer Published Date - 11:49 AM, Fri - 23 May 25

కర్ణాటక రాజధాని బెంగళూరులో భాషాపరమైన (Kannada Language) వివాదాలు రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో, అక్కడి నుంచి కొన్నీ సంస్థలు తమ కార్యాలయాలను ఇతర నగరాలకు మార్చాలని భావిస్తున్నాయి. తాజాగా ఈక్వల్ లైఫ్ (Equal Life) అనే ప్రైవేట్ సంస్థ బెంగళూరును వీడి మహారాష్ట్రలోని పుణే నగరానికి తరలిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ కౌశిక్ ముఖర్జీ(CEO Kaushik Mukherjee) స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Butter Milk: మజ్జిగ ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీరికి మాత్రం విషం.. ఎవరు తాగకూడదంటే!
‘‘బెంగళూరులో ఇటీవల జరుగుతున్న భాషాపరమైన గొడవలు, మా ఉద్యోగుల మనోస్థితిని దెబ్బతీస్తున్నాయి. వారి భద్రతే మా ప్రథమధ్యేయం. కాబట్టి వచ్చే 6 నెలల్లో మా కంపెనీ కార్యాలయాన్ని పుణేకు తరలిస్తున్నాం. మా ఉద్యోగులెవరూ భాషా వివాదాల్లో బలై పోకూడదు’’ అంటూ కౌశిక్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన నేపథ్యంలో బెంగళూరులో ఉన్న ఇతర కంపెనీలు కూడా ఇదే దారిలో పయనించే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల బెంగళూరులో రోడ్లపైన ఉన్న ఇంగ్లీష్ సైన్‌బోర్డులు తొలగించి కన్నడ బోర్డులకే ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్యమాలు, కొన్ని చోట్ల జరిగిన భాషా ఆధిపత్యానికి సంబంధించిన ఘర్షణలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగుల్లో భయం కలిగిస్తున్నాయి. దీంతో ఐటీ, స్టార్టప్ కంపెనీలు తమ కార్యకలాపాలకు పుణే, హైదరాబాద్ వంటి నగరాలను ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రభావం బెంగళూరులో పెట్టుబడులపై చెడు ప్రభావం చూపవచ్చన్నందుకు నిపుణులు హెచ్చరిస్తున్నారు.