Ashok Chavan: కాషాయ కండువా కప్పుకున్న మాజీ సీఎం అశోక్ చవాన్
- Author : Latha Suma
Date : 13-02-2024 - 2:37 IST
Published By : Hashtagu Telugu Desk
Ashok Chavan : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్(Ashok Chavan) మంగళవారం బీజేపీ(bjp)లో చేరారు. ముంబయిలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఆ పార్టీలో చేరుతున్నానని అంతకుముందు ఆయన వెల్లడించారు. నేడు తన నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానుందని అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాందీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లు మీతో ఫోన్‌లో ఏమైనా సంప్రదింపులు జరిపారా అని ప్రశ్నించగా సమాధానాన్ని అశోక్ చవాన్ దాటవేశారు. తనతో కలిసి బీజేపీలో చేరాల్సిందిగా తాను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను తాను కోరలేదని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బీజేపీ(bjp)లో అశోక్ చవాన్ చేరికను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Deputy CM Devendra Fadnavis) స్వాగతించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చవాన్ బీజేపీలో చేరడం హర్షణీయమని అన్నారు. దిగ్గజ నేత కాషాయ పార్టీలోకి రావడం ఆహ్వానించదగిన పరిణామమని పేర్కొన్నారు.
మరోవైపు మహరాష్ట్ర(Maharashtra )లో కాంగ్రెస్‌కు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. సీనియర్ నేతలు బాబా సిద్దిఖీ, మిలింద్ డియోరా వంటివ నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు అశోక్ చవాన్ కూడా వెళ్లిపోవడం మహారాష్ట్రలో కాంగ్రెస్(congress)కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. కాగా, పార్టీని వీడాలన్న నిర్ణయం తన వ్యక్తిగతమని అశోక్ చవాన్ తెలిపారు.
read also : Farmers: పంజాబ్-చండీగఢ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం