Rajya Sabha : 12 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
- By Latha Suma Published Date - 03:45 PM, Wed - 7 August 24

Rajya Sabha Elections : రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉప ఎన్నికల(By-elections) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) విడుదల చేసింది. ఇక ఇందులో తెలంగాణలోని ఒక స్థానానికి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కేకే. దీంతో తెలంగాణలోని ఒక స్థానానికి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. సెప్టెంబర్ 3న ఎన్నికలు, అదే రోజు కౌంటింగ్ ఉంటుంది.. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని పేర్కొంది ఎన్నికల సంఘం. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుందని వెల్లడించింది ఎన్నికల సంఘం.
కాగా, సార్వత్రిక ఎన్నికల్లో పలువురు లోక్‌సభ ఎంపీలుగా ఎన్నికవడం, రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా…తదితర రాజ్యసభ సభ్యులు ఇటీవల ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నామినేషన్లకు ఆగస్టు 21 చివరి తేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలంగాణలో కేకే రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది.