Budget : మొబైల్ ఫోన్లపై సుంకం తగ్గింపు..బంగారం, వెండి కస్టమ్ డ్యూటీ తగ్గింపు
మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
- By Latha Suma Published Date - 02:06 PM, Tue - 23 July 24

Union-Budget: నేడు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్(Minister Nirmala Sitharaman) బంగారం, వెండితో(Gold and silver) పాటు మొబైల్ ఫోన్ల(Mobile phones) ధరలు కూడా తగ్గనున్నట్లు వెల్లడించారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించారు. ఇ-కామర్స్‌పై టీడీఎస్ రేటు 1శాతం నుండి 0.1 శాతానికి తగ్గించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆరు నెలల్లో కస్టమ్స్(Customs )సుంకం విధానాన్ని సమగ్రంగా సమీక్షించాలని నిర్ణయించినట్లు మంత్రి నిర్మాలా సితారామన్ తెలిపారు. 1961 నాటి ఆదాయ పన్ను చట్టాన్ని కూడా సమగ్రంగా రివ్యూ చేయనున్నట్లు మంతి ప్రకటించారు. కాగా, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి బడ్జెట్ ను మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో వివిధ రంగాలకు సంబంధించి పలు ప్రకటనలు చేశారు. ప్రభుత్వం చాలా రంగాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించింది.
Read Also: Budget 2024 : బడ్జెట్ లో మరోసారి తెలంగాణకు మొండిచేయి
అంతేకాక.. క్యాన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి మినహాయించబడ్డాయి. సోలార్ ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే మినహాయింపు పొందిన మూలధన వస్తువుల జాబితాను విస్తరించాలని కూడా నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగించబడింది. లెదర్ వస్తువులు, సీఫుడ్ చౌకగా లభించనున్నాయి. అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి, బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్‌లపై 25 శాతానికి పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. నిర్దేశిత టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 10శాతం నుంచి 15 శాతానికి పెంచారు.
Read Also: Union Budget 2024: ముద్రా రుణ పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు