Trump Tariffs India : ట్రంప్ అన్నంత పని చేసాడుగా..ఇండియాపై టారిఫ్‌ల మోత
Trump Tariffs India : భారత్ మిత్రదేశం అయినప్పటికీ అక్కడ సుంకాలు ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఉన్నాయని విమర్శించారు. దీంతో అమెరికా నుంచి భారత్‌కు వస్తువుల ఎగుమతులు తగ్గిపోయాయని చెప్పారు
- By Sudheer Published Date - 07:08 PM, Wed - 30 July 25

భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) సాధ్యపడలేదని డొనాల్డ్ ట్రంప్ (Trump ) ప్రకటన చేశారు. ఆగస్టు 1వ తేదీ చివరి గడువుగా పెట్టిన ట్రంప్, అప్పటి లోపు ఒప్పందం కుదిరితే టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పారు. కానీ అమెరికా డిమాండ్లు ఎక్కువగా ఉండటంతో భారత్ నుంచి ఒప్పందానికి సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం భారత్ మీద 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం.. భారత్ మిత్రదేశం అయినప్పటికీ అక్కడ సుంకాలు ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఉన్నాయని విమర్శించారు. దీంతో అమెరికా నుంచి భారత్‌కు వస్తువుల ఎగుమతులు తగ్గిపోయాయని చెప్పారు. అంతేకాకుండా భారత్ ఎప్పుడూ రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తోందని, ఉక్రెయిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, చైనా, భారత్ లాంటి దేశాలు ఇప్పటికీ రష్యా చమురు కొనుగోలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తగిన విధంగా ఎదుర్కొనేందుకు ఈ టారిఫ్‌లు విధిస్తున్నట్లు చెప్పారు.
Dhruv Jurel: టీమిండియాకు గుడ్ న్యూస్.. పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన కీలక ఆటగాడు!
ఈ చర్యల వల్ల భారతదేశానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 2023లో భారత్ అమెరికాకు దాదాపు రూ.87 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. వీటిలో ఔషధాలు, కమ్యూనికేషన్ పరికరాలు, దుస్తులు ముఖ్యమైనవి. తాజా టారిఫ్‌ల కారణంగా రూ.7 బిలియన్ మేరకు నష్టం వాటిల్లవచ్చని అంచనా. భారత్ మొత్తం ఎగుమతుల్లో 87 శాతం ఈ టారిఫ్‌ల ప్రభావానికి లోనవుతుందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. మోదీ గత ఫిబ్రవరిలో అమెరికా పర్యటనలో 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూ.500 బిలియన్‌కు పెంచాలన్న లక్ష్యం వెల్లడించినా, ఇప్పటిదాకా పెద్దగా పురోగతి కనిపించలేదు.
ఇతర అన్ని అంశాలపై చర్చలు ముందుకు సాగినా, డెయిరీ ఉత్పత్తుల విషయంలో భారత్, అమెరికా మధ్య స్పష్టమైన అభిప్రాయం కుదరలేదు. అమెరికాలో నాన్ వెజ్ పద్ధతుల్లో పాలు ఉత్పత్తి చేస్తారు. అలాంటి పాలను భారత్‌లోకి అనుమతించడానికి ఇక్కడి ఆధ్యాత్మిక దృష్టికోణం అడ్డుగా నిలుస్తోంది. అమెరికా మాత్రం తమ డెయిరీ ఉత్పత్తుల్ని భారత్‌లోకి అనుమతించాల్సిందేనని ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ విషయం ట్రేడ్ డీల్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం టారిఫ్‌లు అమల్లోకి రానుండగా, భారత్ మరింత వ్యూహాత్మకంగా ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.