Junior Doctor : డాక్టర్ పై హత్యాచారం ఘటన..సీబీఐకి కేసు అప్పగించిన హైకోర్టు
ఈ కేసులో సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, పలువురు పిటిషనర్లు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు.
- Author : Latha Suma
Date : 13-08-2024 - 6:35 IST
Published By : Hashtagu Telugu Desk
Junior Doctor: కోల్‌కతాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి పై హత్యాచారం ఘటన పై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమికంగా ఈ కేసు దర్యాప్తులో గణనీయమైన పురోగతి కనిపించడం లేదని జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. యంత్రాంగం బాధితురాలి లేదా బాధితురాలి కుటుంబంతో లేదని పేర్కొనడం సమంజసమేనని కోర్టు పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
ఆగస్ట్ 14 ఉదయం 10.00 గంటలకల్లా కేసు డైరీ, ఇతర రికార్డులను సిబిఐకి అప్పగించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. సమ్మె విరమించాలని నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులను కోర్టు కోరింది. ఈ కేసు మొదట్లో ప్రిన్పిపాల్‌పై హత్య కేసు ఎందుకు నమోదు చేయలేదని, తాలా పోలీస్ స్టేషన్‌నలో అసహజ మరణంగా ఎందుకు నమోదు చేశారని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ట్రైనీ మృతదేహం రహదారిపై కనిపించలేదని, ఆస్పత్రి సూపరింటెండెంట్ లేదా ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేయాలని జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం, జస్టిస్ హిరణ్మరు భట్టాచార్యలతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. ఘటన జరిగిన ఆర్.జి కార్ ఆసత్రి ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసిన సందీఫ్ కుమార్ ఘోష్‌ను కొన్ని గంటల్లోనే మరో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ పదవిని బహుమతిగా ఎలా ఇచ్చారని జస్టిస్ శివజ్ఞానం ప్రశ్నించారు.
“ఆయన చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి అని, మీ క్లయింట్‌ను ఇంటికి పంపండి” అని జడ్జి వ్యాఖ్యానించారు. ఘటన అనంతరం ఆర్‌జి కార్ ప్రిన్సిపల్ నుండి వాంగ్మూలం ఎందుకు నమోదు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఆయనను ఎందుకు రక్షిస్తున్నారు. ఆయన వాంగ్మూలమే ఆధారం.. ఏదో మిస్సైంది అని కోర్టు పేర్కొంది.
Read Also: Ishan Kishan: బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్