Pamban Bridge : పాంబన్ బ్రిడ్జి ప్రత్యేకలు మీకు తెలుసా ?
Pamban Bridge : తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ వంతెన, రామేశ్వరాన్ని రైల్వే మార్గంలో దేశానికి అనుసంధానించేందుకు ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది
- By Sudheer Published Date - 10:00 AM, Sun - 6 April 25

శ్రీరామనవమి (Sriramanavami ) పర్వదినాన్ని పురస్కరించుకొని దేశానికి మరొక గొప్ప అభివృద్ధి సంకేతంగా నిలిచే పంబన్ బ్రిడ్జ్(Pamban Bridge)ను ప్రధాని నరేంద్ర మోదీ (Modi) అధికారికంగా ప్రారంభించనున్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ వంతెన, రామేశ్వరాన్ని రైల్వే మార్గంలో దేశానికి అనుసంధానించేందుకు ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఎంతో ముఖ్యమైన ముందడుగు కావడం గమనార్హం.
భారతదేశపు దిగ్విజయ రైల్వే నిర్మాణాల్లో ఒకటైన పాంబన్ బ్రిడ్జి, తమిళనాడులోని మానవాళి తెలివితేటలను చాటిచెప్పే అద్భుత కట్టడం అని చెప్పొచ్చు. ఈ వంతెన రామేశ్వరాన్ని మెయిన్ ల్యాండ్‌తో కలుపుతుంది. ఈ బ్రిడ్జిలోని వర్టికల్ లిఫ్ట్ సిస్టమ్ పూర్తిగా వెల్డింగ్‌తో నిర్మించబడింది. ఒకే భాగంగా రూపొందించటం వల్ల ఇది మరింత బలంగా ఉంటుంది. సాధారణంగా గుండ్రని స్క్రూ, బోల్ట్ వాడే చోట, ఇక్కడ 25^6 అనే స్థాయిలో బలమైన వెల్డింగ్ వాడటం ప్రత్యేకతగా నిలిచింది.
Trump Effect : మార్కెట్లకు పరుగులు పెడుతున్న అమెరికన్లు
పాంబన్ బ్రిడ్జికి మొత్తం 99 పిల్లర్లు ఉన్నాయి. వీటిని సముద్రపు అడుగున ఉన్న గట్టి నేల వరకు 25-35 మీటర్ల లోతున ఏర్పాటు చేశారు. అలాగే 65*6 స్థాయిలో పునాదులు వేసి భద్రమైన నిర్మాణం అందించారు. ఈ బ్రిడ్జి రాబోయే 100 ఏళ్ల వరకూ పటిష్ఠంగా నిలబడగలదని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. సముద్రపు అలలను తట్టుకుని నిలిచేలా దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వాతావరణ మార్పులకు ప్రతికూలత లేకుండా దీన్ని నిర్మించడం విశేషం.
గరిష్ఠంగా గంటకు 80 కి.మీ వేగంతో రైళ్లు ఈ వంతెనపై దూసుకెళ్లగలవు. 3Xo * e^6 అనే లెక్కల ఆధారంగా గరిష్ట వేగాన్ని నిర్ధారించారు. ఈ అద్భుత వంతెన నిర్మాణానికి సుమారు రూ.535 కోట్లు ఖర్చయింది. పాంబన్ వంతెన కేవలం ఒక రవాణా మార్గం మాత్రమే కాదు, ఇది భారత నిర్మాణ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గుర్తుగా నిలిచింది. రామేశ్వరం పుణ్యక్షేత్రాన్ని చేరేందుకు ప్రయాణించే భక్తులకు ఇది ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ముఖ్యమైన మార్గం. ఈ వంతెన ప్రారంభోత్సవాన్ని శ్రీరాముని పుట్టినరోజైన శ్రీరామనవమి (Sriramanavami) నాడే జరుపుకోవడం ఒక విశిష్టత. ఎందుకంటే రామేశ్వరం రామాయణంలో ప్రముఖ స్థలంగా పేర్కొనబడింది. ఈ నేపథ్యంలో దేశ సాంస్కృతిక వైభవాన్ని, ఆధునిక అభివృద్ధిని కలబోసే ఈ వంతెన జాతికి అంకితం చేయడం గర్వకారణంగా మారింది. పంబన్ వంతెన దేశ ఇంజినీరింగ్ ప్రతిభను చూపిస్తూ, రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలవనుంది.