UPI: యూపీఐ చెల్లింపులపై పరిమితులు ఎంతో తెలుసా?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రోజులో యూపీఐ ద్వారా రూ. లక్ష వరకే పంపుకోగలరు.
- Author : Maheswara Rao Nadella
Date : 07-12-2022 - 11:38 IST
Published By : Hashtagu Telugu Desk
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రోజులో యూపీఐ (UPI) ద్వారా రూ. లక్ష వరకే పంపుకోగలరు. ఇది NPCI పెట్టిన పరిమితి. కానీ, బ్యాంకులు (Banks) సైతం విడిగా పరిమితులు విధిస్తున్నాయి. ఉదాహరణకు ఎస్ బీఐ (SBI) అయితే ఒక రోజులో గరిష్ఠ పరిమితి అయిన రూ. లక్ష వరకు పంపుకునేందుకు అనుమతిస్తోంది. కెనరా బ్యాంకు (CANARA BANK) రూ.25,000 వరకే యూపీఐ (UPI) ద్వారా ఒక రోజులో అనుమతిస్తోంది. ఇక ఒక రోజులో యూపీఐ (UPI) లావాదేవీల పరంగానూ పరిమితి ఉంది. ఒక రోజులో గరిష్ఠంగా 20 యూపీఐ లావాదేవీల వరకే చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే మరుసటి రోజు వరకు వేచి ఉండక తప్పదు.
గూగుల్ పే ఒక రోజులో NPCI నిబంధనల మేరకు రూ. లక్ష వరకు పంపుకునేందుకు అనుమతిస్తోంది. లావాదేవీల పరిమితి కూడా 20 గానే ఉంది. ఫోన్ పే (Phone Pay), అమెజాన్ పే (Amazon Pay) సైతం ఇదే విధంగా నిబంధనలు అమలు చేస్తున్నాయి. పేటీఎం (Paytm) రోజులో గరిష్ఠంగా రూ.లక్ష పంపుకునేందుకు అనుమతిస్తోంది. కాకపోతే ఒక గంటలో రూ.20వేల పరిమితిని అమలు చేస్తోంది. గంటలో 5 లావాదేవీల వరకు పేటీఎంలో(Paytm) చేసుకోవచ్చు.
Also Read: Duvvada: దువ్వాడలో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయిన యువతి..