Duvvada: దువ్వాడలో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయిన యువతి..
విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ (Railway Station)లో ఓ ఎంసీఏ విద్యార్థిని ఫ్లాట్‌ఫాం - రైలు మధ్య ఇరుక్కుపోయింది.
- Author : Maheswara Rao Nadella
Date : 07-12-2022 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖ జిల్లా దువ్వాడ (Duvvada) రైల్వే స్టేషన్ (Railway Station)లో ఓ ఎంసీఏ విద్యార్థిని ఫ్లాట్‌ఫాం – రైలు మధ్య ఇరుక్కుపోయింది. బయటకు రాలేక రెండు గంటలపాటు అలాగే ఉండిపోయింది. చివరికి ప్లాట్‌ఫామ్‌ను బద్దలుగొట్టి ఆమెను రక్షించాల్సి వచ్చింది. అన్నవరానికి చెందిన 20 ఏళ్ల శశికళ దువ్వాడ (Duvvada)లోని ఓ కాలేజీలో ఎంసీఏ (MCA) ఫస్టియర్ చదువుతోంది. రోజువారీలానే గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలులో దువ్వాడ (Duvvada) చేరుకుంది. స్టేషన్‌లో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్ కిందికి జారిపడింది. దీంతో ప్లాట్‌ఫామ్ – రైలు మధ్య ఇరుక్కుపోయింది.
బయటకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ విఫలమైంది. ప్రయాణికులు కూడా ఆమెను బయటకు లాగేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి సమాచారం అందుకున్న రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతి ఇరుక్కుపోయిన చోట ప్లాట్‌ఫామ్‌ను బద్దలుగొట్టి ఆమెను ఆమెను రక్షించారు. ఇందుకోసం దాదాపు గంటన్నర సమయం పట్టింది. గాయపడిన శశికళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమెను బయటకు తీసిన అనంతరం దాదాపు గంటన్నర తర్వాత రైలు అక్కడి నుంచి బయలుదేరింది.
Also Read: Yashoda: ఓటీటీలోకి ‘యశోద’ మూవీ. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..