Emergency Ticket System : ‘ఐఆర్‌సీటీసీ’లో ఎమర్జెన్సీ టికెట్ సిస్టమ్‌పై వివాదం.. ఏజెంట్ల దందా
ఆన్‌లైన్‌లో తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు కష్టతరంగా మారాయని ఐఆర్‌సీటీసీకి(Emergency Ticket System) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
- By Pasha Published Date - 03:43 PM, Tue - 28 January 25

Emergency Ticket System : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ నిర్వహణ తీరు పేలవంగా మారింది. ఐఆర్‌సీటీసీకి చెందిన ఈ- టికెట్ సేవల్లో పదేపదే అంతరాయం తలెత్తుతోంది. రైల్వే టికెట్లను బుక్ చేసుకోవడంలో రోజువారీ సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో అత్యవసరాలు ఏర్పడినప్పుడు తత్కాల్ టికెట్ల బుకింగ్ సర్వీసులపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బుకింగ్‌లకు అంతరాయం కలిగి ఇబ్బంది పడుతున్నారు. ఏజెంట్లను ప్రోత్సహిస్తూ రైల్వే వ్యవస్థ ప్రజల్లో చేతులారా ప్రతిష్ఠను మసకబార్చుకుంటోందనే విమర్శలు వినవస్తున్నాయి.
Also Read :2024 Elections Donations : 2024 ఎన్నికల వేళ బీజేపీ విరాళాలు 87 శాతం జంప్.. కాంగ్రెస్‌కు సైతం..
రైల్వే మంత్రి ఒకసారి ఈ వెబ్‌సైట్‌ను..
ఆన్‌లైన్‌లో తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు కష్టతరంగా మారాయని ఐఆర్‌సీటీసీకి(Emergency Ticket System) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తత్కాల్ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి రైల్వే మంత్రి ఒకసారి IRCTC వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని రైల్వే ప్రయాణికులు సూచిస్తున్నారు. ‘‘IRCTC వెబ్‌సైట్/యాప్ ఉదయం 10 గంటలకు పని చేయదు. మీరు లాగిన్ అయ్యే సమయానికి అన్ని టిక్కెట్లు దాదాపు అయిపోతాయి. ఒక దశాబ్దం గడిచినా వారు దీన్ని సరిదిద్దలేరు’’ అని ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. దీన్ని చూసి చాలామంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘‘జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబెర్ లాంటి యాప్స్ ఎక్కువ డిమాండ్ ఉన్న సమయంలోనూ కచ్చితత్వంతో సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేస్తుంటాయి ?’’ అని రవిసుతంజని నెటిజన్ కామెంట్ పెట్టారు. దీన్ని చాలామంది నెటిజన్లు సమర్ధించారు.
Also Read :Chandrababu Cases : చంద్రబాబుకు ‘సుప్రీం’లో భారీ ఊరట.. ఒక్క మాట వినకుండానే ఆ పిటిషన్ కొట్టివేత
ఏజెంట్లు ఒక్కో టికెట్‌పై ..
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ అనేది తత్కాల్ సిస్టమ్ బ్లాక్ మార్కెటింగ్ ఏజెంట్లకు అనుకూలంగా ఉందని పలువురు నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఏజెంట్లు ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.500 దాకా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధానంతో రోజువారీ ప్రయాణికులు నేరుగా రైల్వే టికెట్లను పొందడం కష్టతరంగా మారిందని చెబుతున్నారు. ఏజెంట్ల వల్ల రైల్వే టికెటింగ్ ప్రక్రియలో బ్లాక్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు ఆజ్యం పోస్తున్నట్లు అవుతోందని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.